దాసరితో సినిమా అటకెక్కినట్టేనా..!

0
294
Dasarai Pawan Kalyan Movie Shocking News

Posted [relativedate]

Dasarai Pawan Kalyan Movie Shocking Newsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్లో సినిమా గురించి రెండు సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. నేడో రేపో అన్ననత ఊపు తెచ్చి అసలు సినిమా గురించే పట్టించుకోవడమే మానేశారు. ప్రస్తుతం పవర్ స్టార్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఏది దాసరి సినిమా కాదు.. అంతేకాదు ఈ మూడు సినిమాలు పూర్తయ్యేసరికి ఎలా లేదన్నా 2017 సెకండ్ హాఫ్ వచ్చేస్తుంది.

ఇక ఆ తర్వాత కూడా డివివి దానయ్యతో కమిట్ అయిన పవన్ కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. సో డివివి దానయ్య సినిమా కూడా చేశాక కాని దాసరి సినిమా కోసం టైం కేటాయిస్తాడని అంటున్నారు. అయితే ఈలోగా 2018 వచ్చేస్తుంది. 19 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్న పవర్ స్టార్ సంవత్సరం మొత్తం సినిమాలు చేయకుండా కేవలం పార్టీ ప్రచారం మీదే దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నాడట.

సో ఈ లెక్కలన్ని చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ రావు సినిమా ఇప్పుడప్పుడే లేదు అన్నది తెలుస్తుంది. కాటమరాయుడు స్టార్ట్ అయ్యే టైంలో దాసరి నిర్మాణంలో దర్శకుల వేట మొదలైనా మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. మరి పవన్ తో సినిమా చేయాలన్న దాసరి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Leave a Reply