ఒక నెలలో ఇద్దరు అమ్మలతో దాసరి సినిమా?

Posted January 4, 2017

dasari amma starts in onemonth
జయలలిత జీవితకథ ఆధారంగా దర్శకరత్న దాసరి తీయబోతున్న సినిమా గురించి మరిన్ని విషయాలు ముందుకొచ్చాయి. తెలుగు,తమిళ్,హిందీ భాషల్లో ఈ సినిమా తీయనున్నారు.కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే స్క్రిప్ట్ , ప్రీ ప్రొడక్షన్ వర్క్ చురుగ్గా సాగుతోంది. ఇక నటీనటుల విషయంలోనూ ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి.

జయ పాత్ర కోసం హేమ మాలిని, రమ్యకృష్ణ లతో దాసరి సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు.జయ సినీ జీవితానికి సంబంధించిన పాత్రని రమ్య తో, రాజకీయ జీవితానికి సంబంధించిన పాత్రని హేమ మాలినితో వేయించేందుకు దాసరి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో శశికళ పాత్రధారిణి విషయంలో ఓ స్టార్ హీరోయిన్ ని పెట్టాలని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎంజీఆర్,కరుణ,ఎన్టీఆర్,ఏయన్నార్ పాత్రలు కూడా ఈ సినిమాలో వుంటాయని తెలుస్తోంది. ఈ పాత్రల కోసం ఆయా భాషల్లోని ముఖ్య నటుల్నే సంప్రదిస్తున్నారు. ఏదేమైనా ఇంత భారీ తారాగణంతో ఓ నెలలో సినిమా అంటే చిన్న మాట కాదు.ఈ సవాల్ ని దాసరి ఎలా అధిగమిస్తాడో …అయన దశాబ్దాల అనుభవం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.

SHARE