Friday, December 9, 2022
HomeEntertainmentCinema Latestదాసరి ఆ కోర్కెలు తీరకుండానే కన్నుమూశారు

దాసరి ఆ కోర్కెలు తీరకుండానే కన్నుమూశారు

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించి సక్సెస్‌ అయ్యారు. అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో కూడా స్థానం దక్కించుకున్నారు. 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి, 50 సినిమాలకు పైగా నిర్మించి ఎన్నో సినిమాలకు రచన సహకారం అందించిన దర్శకరత్న చివరకు రెండు ప్రాజెక్ట్‌ల గురించి కలలు కని వాటిని నెరవేర్చుకోకుండానే తుది శ్వాస విడిచారు.

ఆ రెండు ప్రాజెక్ట్‌లలో మొదటిది మహాభారతం, రెండవది పవన్‌ కళ్యాణ్‌తో సినిమా. చాలా సంవత్సరాలుగా ‘మహాభారతం’లోని ఏదైనా ఒక ఘట్టంను తీసుకుని భరీ ఎత్తున తెరకెక్కించాలనేది దాసరి కోరిక. అందుకే దాదాపు 500 కోట్లు అవసరం అవుతాయని ఆయన కొన్నాళ్ల క్రితం చెప్పుకొచ్చాడు. అయితే దాసరి ఆ ప్రాజెక్ట్‌ను అనుకోవడం వరకే కాని దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకు వెళ్లలేక పోయారు. ఇక పవన్‌తో సినిమా గురించి రెండు సంవత్సరాలుగా దాసరి ఎదురు చూస్తున్నారు. పవన్‌ హీరోగా తాను సినిమా నిర్మించబోతున్నట్లుగా దాసరి ప్రకటించారు. ఇటీవలే ఒక కథ సిద్దం అయ్యిందని, ‘శౌర్యం’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివతో ఈ సినిమాను నిర్మించాలని దాసరి భావించారు. అందుకు పవన్‌ కూడా ఒప్పుకున్నారు. త్రివిక్రమ్‌ సినిమా పూర్తి అయిన తర్వాత లేదా ఈ సంవత్సరం చివర్లో పవన్‌ డేట్లు కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. ఇంతలోనే ఇలా జరిగింది. దాసరి నిర్మించాలనుకున్న సినిమాలు చేయకుండానే మృతి చెందడం ఆయన అభిమానులను కలిచి వేస్తున్న విషయం.

- Advertisment -
spot_img

Most Popular