వైసీపీ నేత ఇంట్లో దాసరికి విందు..లోగుట్టు?

0
483
dasari dinner in pedakurapadu ysrcp leader kaveti shiva home

  Posted [relativedate]

dasari dinner in pedakurapadu ysrcp leader kaveti shiva home
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తరచూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు.ఈ మధ్య ఓ అడుగు ముందుకేసి కాపు రిజర్వేషన్ తో పాటు ఓ ప్రతిపక్ష నేత ఏమి మాట్లాడతాడో అన్ని అంశాల్ని టచ్ చేస్తున్నారు.దీంతో అయన వైసీపీ నాటకంలో ఓ పాత్రధారి అని చెప్పేందుకు టీడీపీ నేతలకి సులువైపోతోంది. ఇక ముద్రగడ హైదరాబాద్ లో జరిపే చర్చలకు దాసరి ఇంటిని వేదిక చేసుకుంటున్నారు.దాసరి కూడా అప్పట్లో చంద్రబాబు మీద చెలరేగిపోయారు..ఈ మధ్య కాస్త రాజకీయాల గురించి మౌనం పాటిస్తున్నారు.కానీ అయన మనసు కూడా వైసీపీ వైపే గుంజుతోందట.అయన ఇంట్లో జరిగే ఉద్యమ చర్చల్లో ఆ పార్టీ నేతలు 80 శాతానికి పైమాటే .

ఇక ఇటీవల ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్ కోసం గుంటూరు వచ్చిన అయన ఓ వైసీపీ నేత ఇంట భోజనం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త కావేటి శివ నాగ మనోహర్ నాయుడు ఆహ్వానాన్ని మన్నించి దాసరి అయన ఇంటికి వచ్చారు.విందు ఆరగించారు.ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా? నిజమే ఓ పెద్దాయన్ని భోజనానికి పిలవడం సహజమే.అయితే ఆ ఇంటి లోపల,బయటా అంతా వైసీపీ శ్రేణులదే హవా. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సహా వైసీపీ స్థానిక నేతలు దాసరి కంట్లో పడేందుకు తెగ ప్రయత్నించారు.ఈ హడావిడి అంతా చూసిన వాళ్లకి దాసరి వైసీపీ నేత అనిపించింది.కాదని అయన అంటున్నా చేసే పనులు అలాగే వున్నాయి.త్వరలో కాకపోయినా 2019 ఎన్నికల ముందు అయినా దాసరి,ముద్రగడ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని చెప్పడానికి ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.

Leave a Reply