Posted [relativedate]
అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు సినిమా మూలస్తంభం ఆయన అని అందరికీ తెలిసిందే. అలాగే దాసరి నారాయణరావు.. చిత్ర పరిశ్రమలో దర్శకరత్నగా ఖ్యాతి సంపాదించున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో హిట్ సినిమాలు నేటికీ ఎవ్వర్ గ్రీన్ గా నిలిచాయి. ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, మేఘసందేశం.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద లిస్ట్ రావడం మాత్రం ఖాయం.
ఇక అసలు విషయానికొస్తే.. ఎంతో సఖ్యతగా ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన వీరిద్దరి మధ్య కూడా ఘర్షణలు ఉండేవట. నాగేశ్వరరావు తనను ఒక సందర్భంలో చాలా ఘోరంగా అవమానించారని, ఆ నాటి నుంచి తమ మధ్య సంబంధాలు సరిగా లేవని దాసరి చెప్పారు. అక్కినేని ప్రవర్తన తనను చాలా బాధపెట్టించిందన్నారు.ఆ విషయాన్ని తాను బయటకు వెల్లడిస్తే అక్కినేనిపై ప్రజలకు ఉన్న గౌరవం మొత్తం పోతుందని,అందుకే ఆ విషయాలను తన జీవితంలో ఎన్నడూ బయటపెట్టలేనని తెలిపారు. అలాగని ఆయన తనకు చేసిన అవమానాన్ని కూడా జీవితంలో మర్చిపోలేనన్నారు. ఆ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదని మాట దాటేశారు దాసరి.