Friday, October 22, 2021
HomeEntertainmentCinema Latestదాసరి మరణంపై అనుమానాలు

దాసరి మరణంపై అనుమానాలు

దర్శకరత్న దాసరి నారాయణ రావు హఠాత్మరణం అందరికి షాక్‌ ఇస్తుంది. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దాసరి మరణంను జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు అంటూ డాక్టర్లు తేల్చిన విషయం తెల్సిందే. కాని దాసరి పెద్ద కోడలు మాత్రం తన మామ మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను 15 రోజుల క్రితం మామగారితో మాట్లాడాను అని, ఆ సమయంలో చక్కగా తనతో మాట్లాడారు అంటూ చెప్పుకొచ్చింది.

కొన్నాళ్ల క్రితం హాస్పిటల్‌లో మామగారు ఉన్న సమయంలో కూడా తాను ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించాను. అప్పుడు తనను లోపలకు వెళ్లనివ్వలేదు. దాసరి పెద్ద కుమారుడితో ఈమెకు విడాకులు కాలేదు. అయితే ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. ఆమెకు ఆస్తిలో వాటా ఇస్తానంటూ దాసరి స్వయంగా 10 రోజుల క్రితం కలిసినప్పుడు చెప్పారట. అలాగే ఆమె కొడుకు మాస్టర్‌ దాసరి నారాయణరావును ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని కూడా హామీ ఇచ్చారట. ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చాను, మీకు అన్యాయం చేయను అంటూ మామగారు తనకు హామీ ఇచ్చారు అని, ఈ సమయంలో ఇలా కావడంపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె అంటున్నారు. దాసరి మరణంపై పెద్ద కోడలు అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

- Advertisment -
spot_img

Most Popular