దాసరి డైరెక్షన్ లోముద్రగడ…పవన్ మాటేంటి?

 dasari narayana direction mudragada hero kapu meeting pawan kalyan where
దర్శకరత్న దాసరి నారాయణరావు …ఒకప్పుడు ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగం లోతనదైన బ్రాండ్ వేశారు.కొత్త తరం ఒరవడితో దర్శకుడిగా ఆయన ప్రాభవానికి గండిపడి దాదాపు 15 ఏళ్ళు గడిచింది.ఇక చిరు రాజకీయ ఎంట్రీ తో అక్కడ కూడా ఆయన హవా తగ్గింది.తరువాత బొగ్గు కుంభకోణం బయటపడడంతో దాసరి ప్రతిష్ట బాగా దెబ్బ తింది.వ్యక్తిగతంగానూ అనుక్షణం ఆయనకు చేదోడువాదోడుగా వుండే సతీమణి పద్మ మరణం కూడా ఆయన్ను కుంగదీసింది.ఈ పరిస్థితుల్లో ఆయనకు ఓ సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి మరీ మాటిచ్చారు.దాసరి నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలొచ్చాయి.ఎందరో దర్శకుల పేర్లు ఆ సినిమాకి ముడిపెడుతూ పుకార్లు పుట్టాయి.కానీ అవి నిజం కాకముందే …ఆ ఇద్దరి దారులు వేరైనట్టు కనిపిస్తోంది.

జగన్ ఏ రోజయితే దాసరి ఇంటికెళ్లారో అప్పటినుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి.జగన్ కి అనుకూలంగా దాసరి మాట్లాడారు.తరువాత వచ్చిన కాపు ఉద్యమం సమయంలో దాసరి ప్రాధాన్యం అమాంతం పెరిగింది.ముద్రగడ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా దాసరి ఇంట్లోనే కాపు పెద్దలతో సమావేశమవుతున్నారు. దాదాపుగా అక్కడే వుంటున్నారు.చివరికి కాపు పెద్దల సమావేశాల కోసం తనపై నిత్యవిమర్శలు చేసే దాసరి ఇంటికే చిరు వెళ్లాల్సివచ్చింది.ఇదంతా దాసరి డైరెక్షన్ లో జరుగుతోందని తెలుస్తోంది.చర్చల్లో కూడా వైసీపీ నేతలు బొత్స,ఉమ్మారెడ్డి ,అంబటి వంటి నేతల మాటకే దాసరి,ముద్రగడ విలువిస్తున్నారట.చిరు పాత్ర నామమాత్రంగా ఉండేలా చూస్తున్నారట.విషయం అర్థమైనా చిరు మౌనం వహిస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్ సభ తర్వాత దాసరి ధోరణిలో పూర్తి మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.

పవన్ తనంతట తాను వస్తే తప్ప కాపు ఉద్యమంలోకి పిలవబోమని ముఖ్యనేతలు చెప్పడం వెనుక దాసరి హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.కాపు ఉద్యమం ద్వారా తన డైరెక్షన్ లో ముద్రగడని రాజకీయ హీరో చేయాలని దాసరి తపిస్తున్నారు .పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందడానికి ఇదే అవకాశంగా తీసుకుంటున్నారు.ఈ పరిణామాన్ని పవన్,కాపు సమాజం ఎలా తీసుకుంటుందో ? దాసరి కల ఫలిస్తుందో లేదో చూడాలి.కానీ ఆపదలో ఆడుకోడానికి వచ్చిన పవన్ పట్ల దాసరి వైఖరిని మాత్రం పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఆ ప్రశ్నలకి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోకప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మేస్త్రికి తప్పకపోవచ్చు.

SHARE