గురువే లేనప్పుడు శిష్యుడిని పట్టించుకుంటారా?

383
Dasari-Narayana-Property-Cl
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దాసరి నారాయణ రావును టాలీవుడ్‌ సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది గురువు గారు అంటూ సంబోధిస్తూ ఆయన్ను గౌరవంగా పిలుస్తూ ఉంటారు. ఎంతో మంది శిష్యులున్నా కూడా దాసరి నారాయణ రావుకు మోహన్‌బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం. అలాగే మోహన్‌బాబుకు కూడా దాసరి నారాయణ రావు అంటూ అమితమైన గౌరవం మరియు ఆయనను తండ్రిగా ఆరాధించే వాడు. దాసరి పలు సందర్బాల్లో మోహన్‌బాబు తన పెద్ద కొడుకు అంటూ చెప్పిన సందర్బంగాలున్నాయి. దాసరి మరణం తర్వాత ఆయన కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దాసరి పెద్ద కోడలు ఆస్తి గొడవలు అంటూ మీడియా ముందుకు వచ్చింది.

దాసరి పెద్ద కోడలుతో అప్పటికప్పుడు మాట్లాడి సమస్యను తాత్కాలికంగా నిలిపేయడంలో మోహన్‌బాబు సఫలం అయ్యాడు. ఇప్పుడు ఆస్తుల గొడవను మోహన్‌బాబు తీర్చాలంటూ టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు అంతా కూడా అంటున్నారు. దాసరి నారాయణ రావు ఇద్దరు కొడుకులు కూడా మొన్నటి వరకు మోహన్‌బాబు అంటే గౌరవంను కనబర్చేవారు. ఇప్పుడు దాసరి చనిపోయిన తర్వాత మోహన్‌బాబు తమ ఆస్తుల విషయంలో, తమ కుటుంబ విషయంలో వేలు పెడతాను అంటే ఒప్పుకుంటారా అనేది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్న. మోహన్‌బాబు ఆస్తుల పంపకం విషయంలో తల దూర్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. మొత్తానికి దాసరి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఆస్తుల విషయాన్ని ఎలా పరిష్కరించుకుంటారో అని సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here