Tuesday, October 26, 2021
HomeEntertainmentCinema Latestటాలీవుడ్ ని చూసి ఏడ్చిన దాసరి.

టాలీవుడ్ ని చూసి ఏడ్చిన దాసరి.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దర్శకరత్న దాసరి నారాయణరావు. ఈపేరు చలనచిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు. అలాంటిది ఆయనకు కష్టం లేదనుకోడానికి లేదు. కుటుంబంలోనే కొన్ని ఇబ్బందులున్నాయి. పెద్ద కొడుకు వివాహం వివాదాస్పదం అయ్యింది. దాసరి కుమారుడితో తెగదెంపులు చేసుకున్న పెద్ద కోడలు సుశీల ఇప్పటికే ఆయన మరణం మీద సందేహాలు అంటూ నోరు విప్పింది. ఇంకా ఇలాంటి సమస్యలు ఎన్ని వున్నా దాసరి ఏ రోజు భయపడలేదు. బేలగా మారలేదు. తన భార్య పద్మ మరణించినప్పుడు మాత్రం ఆయన తీవ్ర విషాదంలో పడిపోయారు. అంతకు ముందు కూడా ఓ రోజు దాసరి ఏడ్చారు .అది ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.

సామాజిక స్పృహతో చిత్రాలు తీసిన దర్శకుడు టి.కృష్ణ ఈ తరంలో కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. నేటి తరం నటుడు గోపీచంద్ తండ్రి అంటే ఎక్కువ మంది గుర్తు పడతారేమో. కానీ ఆయన తీసింది కొన్ని సినిమాలే అయినా నాటి తరాన్ని ఓ ఊపు ఊపాయి. ప్రతిఘటన,రేపటిపౌరులు,దేవాలయం,నేటి భారతం లాంటి సినిమాలు జాతిని జాగృతపరిచాయి. అంతటి దర్శకుడు కృష్ణ కాన్సర్ తో చనిపోయినప్పుడు అంత్యక్రియల తర్వాత దాసరి చొరవతో సంస్మరణ సభ ఏర్పాటు చేస్తే కేవలం 11 మంది మాత్రమే వచ్చారట. అది చూసి టాలీవుడ్ ఇంత కమర్షియల్ అయ్యిందా అని దాసరి ఏడ్చారట. ఆరోజు టాలీవుడ్ ధోరణిని తప్పుబడుతూ దాసరి ఏకిపారేశారట. అంతటి గొప్ప దర్శకుడిని ఇంతలా నిర్లక్ష్యం చేస్తారా అని కడిగిపారేశారు.

- Advertisment -
spot_img

Most Popular