హమ్మయ్య.. దాసరి డిశ్చార్జ్ అయ్యారు

Posted March 28, 2017

dasari narayana rao discharged from hospitalదాదాపు రెండు నెలల క్రితం అంటే జనవరి 29న దర్శకరత్న దాసరి నారాయణ రావు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆపరేషన్ కూడా నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఇతర అనారోగ్య సమస్యలు లంగ్ ఇన్ఫెక్షన్, ఓవర్ కొలెస్ట్రాల్  వంటివి కూడా దాసరిని చుట్టుముట్టడంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచారు. ఈ నేపధ్యంలో ఆయనకు రెండు మూడు రకాల శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారని ఇన్ సైడ్ వర్గాల టాక్.  సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు  కూడా ఆయన్ని పరామర్శించారు. ఏది ఏమైనా ఆయన గత రెండు నెలల నుండి ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం దాసరి  ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఈ రోజు ఆయన్ని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంకా మరికొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని

రెగ్యులర్ చెకప్ కి రావాలని డాక్టర్లు సూచించారట. కాగా దాసరి డిశ్చార్జ్ కావడం పట్ల సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

రాఘవేంద్రరావు ఎన్టీఆర్ బయోపిక్ ని సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో  దాసరి  ఆరోగ్యం పూర్తిగా నయమయిన తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకత్వం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.

SHARE