Tuesday, October 26, 2021
HomeEntertainmentCinema Latestఅధికారిక లాంచనాలతో దాసరి అంత్యక్రియలు పూర్తి

అధికారిక లాంచనాలతో దాసరి అంత్యక్రియలు పూర్తి

దర్శకరత్న దాసరి నారాయణ రావు నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మరణించిన విషయం తెల్సిందే. ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన నేపథ్యంలో ఆయన మృత దేహాన్ని ఎక్కువ సమయం ఉంచకూడదనే ఉద్దేశ్యంతో నేడు మద్యాహ్నంకు అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అయితే సందర్శణ కోసం లక్షలాది మంది తరలి వస్తున్న నేపథ్యంలో అనుకున్న సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా ఆయన్ను దహనం చేయడం జరిగింది. మెయినాబాద్‌లోని దాసరి సొంత ఫామ్‌ హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరపడం జరిగింది.

దాసరి తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు మరియు ఆయన కేంద్ర మాజీ మంత్రి అవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలను జరిపించింది. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి మరి గౌరవ వందనం సమర్పించి దాసరి అంత్యక్రియలు జరిపించారు. దాసరి నారాయణ రావు భార్య పద్మ 2011లో మరణించిన సమయంలో ఆమెను కూడా ఇక్కడే దహనం చేయడం జరిగింది. దాసరి కోరినట్లుగానే అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. దాసరి కడచూపు దక్కక ఎంతో మంది ఇంకా కూడా దాసరి ఇంటిముందు, ఆయన ఫాం హౌస్‌ వద్ద శోఖిస్తున్నారు. వేలాది మంది అశ్రు నయనాల మద్య సాంప్రదాయం ప్రకారం దాసరి పెద్ద కొడుకు ప్రభు తలకొరివి పెట్టారు.

- Advertisment -
spot_img

Most Popular