Saturday, October 23, 2021
HomeEntertainmentCinema Latestబ్రేకింగ్‌ న్యూస్‌ : దాసరి పరిస్థితి మళ్లీ విషమం

బ్రేకింగ్‌ న్యూస్‌ : దాసరి పరిస్థితి మళ్లీ విషమం

దాసరి నారాయణరావు ఆరోగ్యం మళ్లీ విషమించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే మూడు నెలల పాటు కిమ్స్‌లో అనారోగ్య కారణంగా చికిత్స పొందిన దాసరి నారాయణ రావు ఇటీవలే డిశ్చార్జ్‌ అయిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాని ఉన్నట్లుండి నిన్నటి నుండి ఆయన ఆరోగ్యం బాగాలేదని, దాంతో ఆయన్ను మళ్లీ హాస్పిటల్‌లో జాయిన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం నిపుణుల సమక్షంలో దాసరి నారాయణ రావు చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అధిక రక్తపోటు మరియు ఊపిరి తిత్తుల సమస్యతో దాసరి బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దాసరికి మరో ఆపరేషన్‌ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దాసరి ఆరోగ్యం కాస్త సీరియస్‌గానే ఉందని వైధ్యులు చెబుతున్నారు. దాంతో సినీ వర్గాల వారు ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని కాస్త ఆందోళన చెందుతున్నారు.

- Advertisment -
spot_img

Most Popular