దాసరి ఆపరేషన్ సక్సెస్

0
251
dasari narayana rao operation sucess

Posted [relativedate]

dasari narayana rao operation sucessదర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో హైదరాబద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఏమయ్యిందోనని యావత్ సినీ ప్రపంచం ఆందోళనకు గురయ్యింది. దాసరి హాస్పటల్ లో జాయిన్ అయ్యాడని తెలుసుకున్న అభిమానులు , శ్రేయాభిలాషలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులని అడిగి తెలుసుకున్నారు.

మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో గత కొన్నిరోజులుగా ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి డయాలసిస్ చేసి వెంటిలేటర్ మీద చికిత్స అందించామన్నారు.  దాసరి ఛాతికి కీ హోల్ సర్జరీ చేశామని, ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగించామని ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం  రెండు మూడు రోజుల్లో మెరుగుపడుతుందని వివరించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దాసరి..  తమిళనాడు సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా చేయడానికి ప్లానింగ్ లో ఉన్నారని, గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారని సన్నిహితులు చెబుతున్నారు.

Leave a Reply