దర్శకరత్న దాసరి మృతితో టాలీవుడ్ మొత్తం శోఖ సంద్రంలో మునిగి పోయింది. ఆయన అభిమానులు, ఆయనను గురువుగా భావించే వారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా అంతా కూడా దుఖ: సాగరంలో ముగిని పోయారు. అంతా కూడా విచారంలో మునిగి ఉండగా దాసరి పెద్ద కోడలు మామ మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు మామ ఆస్తిలో వాటా ఇస్తానంటూ హామీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఇలా జరగడం తనకు అనుమానంగా ఉంది అంటూ దాసరి పెద్ద కోడలు షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
దాసరి వ్యాఖ్యలను తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే దాసరిది సాదారణ మరణం అని, ఎలాంటి హత్య ప్రయత్నం ఆయనపై జరగలేదని తేల్చారు. హత్య జరిగినట్లుగా ఆరోపిస్తున్న ఆమె వ్యాఖ్యలను పోలీసులు కొట్టి పారేశారు. కుటుంబ సభ్యులు, దాసరికి చికిత్స అందించిన వైధ్యులను పోలీసులు ప్రశ్నించి అనుమానాలను నివృత్తి చేయడం జరిగింది. దాసరి అనారోగ్య కారణాల వల్ల చనిపోయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. దానిని పోలీసులు కూడా నిర్థారించారు. దాంతో దాసరి హత్యకు సంబంధించిన అనుమానాలు అన్ని తొలగి పోయినట్లే అంటూ పోలీసు ఉన్నతాధికారులు కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఆస్తి కోసం దాసరి పెద్ద కోడలు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.