దాసరి మాటల్లో నిజమెంత?

Posted October 5, 2016

  dasari narayana said fault words cm kapu meeting
దర్శకరత్న దాసరి నారాయణరావు ఏపీ ప్రభుత్వం మీద మరో ఆరోపణ చేశారు.తాము హైదరాబాద్ లో జరుపుకుంటున్న కాపు సమావేశంపై బాబు సర్కార్ నిఘా పెట్టిందని తాజా ఆరోపణల సారాంశం.అంతటితో ఆగలేదు అయన.తమ సమావేశానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ని పోలీసులు తీసుకెళ్లారని కూడా ఆరోపించారు.కానీ సారు వారు ఓ విషయం మరిచిపోయినట్టున్నారు.సమావేశం జరిగింది హైదరాబాద్ లో.అది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో వుంది ..ఇక్కడ శాంతిభద్రతల అంశాన్ని తెలంగాణ పోలీసులే పర్యవేక్షిస్తారు.పొరుగు రాష్ట్రం పోలీసులు ఇక్కడ ఏమి చేయాలన్నా టీ సర్కార్ అనుమతి తీసుకోవాల్సిందే.

ఆ విధంగా చూస్తే బాబుకి రాజకీయంగా పనికొచ్చే ఏ విషయానికైనా కెసిఆర్ సర్కార్ అనుమతిస్తుందా?ఆ విషయం గురించి చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు.
ఒక వేళ ప్రభుత్వం అంటే దాసరి గారి దృష్టిలో తెలంగాణ సర్కార్ అయ్యుంటే ఏదైనా బయటికి చెప్పాలి.అలా కాకుండా స్టాక్ విమర్శలు,స్టాక్ ఆరోపణలు చేస్తే ఈమధ్య కాలంలో మీరు చేసిన సినిమాల్లాగే బుడుక్కున పేలిపోతాయి.కాస్త ముందు వెనుక చూసుకుని మాట్లాడండి కేంద్ర మాజీ మంత్రి గారూ.

SHARE