పవన్ కోసం దాసరి కన్నేసిన దర్శకుడు ..

  dasari narayana searching pawan movie director
దాసరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా తీస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడని కొన్నాళ్ళు ..గోపాల గోపాల ఫేమ్ డాలీ అని ఇంకొన్నాళ్ళు ప్రచారం సాగింది.త్రివిక్రమ్ …పవన్ కాంబినేషన్ లో తన సొంతసంస్థ లాంటి హాసిని &హారిక బ్యానర్ లో సినిమాకి మాట ఇచ్చారు.ఇక డాలీ ని పవన్ కాటమరాయుడి కోసం వాడుకుంటున్నాడు. దీంతో మరో దర్శకుడి కోసం దాసరి వేట మొదలు పెట్టారట.

ఇక తారక ప్రభు ఫిలిమ్స్ పతాకం పై బోస్ అనే పేరు కూడా రిజిస్టర్ చేశారు.ఈ టైటిల్ పవన్ కోసమేనన్న వార్తలు వినిపిస్తున్నా అసలు దర్శకుడు తేల్లేదన్న మాటలు వస్తుండడంతో ఈ అంశం పై దాసరి దృష్టి సారించారు.శిష్యుల్ని పిలిచి పవన్ సినిమా కి దర్శకుడిగా ఎవరైతే మంచిదని అడిగారట.ఎక్కువమంది ఎన్నికల ముందు వచ్చే సినిమా కాబట్టి బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పారట.దీంతో బోయపాటి,పవన్ కాంబినేషన్ గురించి దాసరి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్ .

SHARE