కిమ్స్ లో దాసరి ..ఊపిరి తిత్తుల సమస్య

0
368
dasari narayanrao in kims hospital

Posted [relativedate]

dasari narayanrao in kims hospital
దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఊపిరితిత్తులు,కిడ్నీ సమస్యలతో ఆయన్ను నిన్న రాత్రి కిమ్స్ లో చేర్చారు.గడిచిన మూడేళ్ళుగా అనారోగ్య సమస్యలతో దాసరి ఇబ్బంది పడుతున్నారు.కొన్నాళ్లుగా పరిస్థితి మెరుగుపడిందని అంతా భావించారు.ఇటీవల ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన పాల్గొనడంతో దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని అనుకున్నారు.

జయలలిత జీవిత కథ ఆధారంగా కొత్త సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం,కాపు ఉద్యమానికి అండగా సమావేశాలు జరపడంతో దాసరి ఈజ్ బ్యాక్ అని అభిమానులు కూడా సంతోషపడ్డారు.ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు తో ఆయన సంబంధాలు మెరుగుపడ్డట్టేనని భావిస్తున్న సమయంలో ఈ అనారోగ్య విషయం బయటికి వచ్చింది.

dasari narayanrao in kims hospital

Leave a Reply