Sunday, October 17, 2021
Homelatestగతమెంతో చెడ్డది

గతమెంతో చెడ్డది

మూడు దశాబ్దాలుగా తెలుగు పాఠకుల్ని అలరిస్తున్న ఈనాడు దినపత్రికకు పోటీగా చాలా పత్రికలు వచ్చాయి. కానీ సరైన పోటీ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావు పెట్టిన ఉదయం దినపత్రిక మాత్రమే. 1984 ఆఖర్లో మొదలైన ఉదయం అప్పట్లో సంచలనం సృష్టించింది. మధ్యాహ్నం వరకు పేపర్ రాకపోయినా.. ఉదయం కోసం జనం ఎదురుచూశారంటే అది ఎంత క్రేజ్ తెచ్చుకుందో వేరే చెప్పక్కర్లేదు. అయితే ఉదయానికి మంచి పేరు వచ్చినా.. ఆర్థికంగా భారం కావడంతో.. పదేళ్ల తర్వాత అప్పటి ఎంపీ మాగుంట ఫ్యామిలీకి దాసరి అమ్మేశారు. 

 

అమ్మడం సంగతి పక్కనపెడితే.. అసలు ఈనాడుకు పోటీగా ఉదయం రావడానికి ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఉదయం పత్రిక పెట్టడానికి ఏడాది ముందు ఈనాడు సంస్థల ప్రచురణ అయిన చతురలో బదనిక అని ఓ నవల ప్రచురితమైంది. ఈ నవల కథంతా దాసరి సినిమాల్లో ఎదిగిన స్టోరీయే. బదనిక ఎవరు చదివినా దాసరి గుర్తొస్తారు. బదనిక ఎందుకు రాశారో తెలీదు కానీ.. అప్పట్నుంచి ఈనాడుపై దాసరికి డౌట్ మొదలైందంటారు. అందుకే బదనిక నవల వచ్చిన ఏడాది లోపే ఉదయం మొదలైంది.

ఉదయంతోనే క్రీడలకు ప్రత్యేక పేజీల కేటాయింపు ప్రారంభమైంది. వార్తాపత్రికల్ని కొత్తపుంతలు తొక్కించిన ఘనత ఉదయానిదేనని అందరూ ఒప్పుకుంటారు. ఈనాడు పత్రికకు కూడా మరోసారి తన వ్యూహాలపై బేరీజు వేసుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది ఉదయం. అప్పట్లో దాసరి, రామోజీ ఉప్పునిప్పుగా ఉన్నా.. తర్వాత రాజీ కుదరడంతో మంచి స్నేహితులైపోయారు. గతంలో సితార మ్యాగజైన్ లో దాసరి సినిమాలు పెద్దగా ఇచ్చేవారు కాదు. కానీ ఆ తర్వాత అంతా సమసిపోయింది. అందుకే అంటారు గతమెంటో చెడ్డది. ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అని.

- Advertisment -
spot_img

Most Popular