బాహుబలికి కాదు పెళ్లిచూపులు కి ఓటేస్తా…దర్శకరత్న దాసరి మాటలివి.పెళ్లి చూపులు సక్సెస్ మీట్ కొచ్చిన దాసరి ఏమాత్రం మొహమాటపడకుండా మీటింగ్ దంచేశారు..ఇలాంటి మంచి సినిమాలు ఓ పది వస్తే ఇండియాలో తెలుగు చిత్రసీమ నెంబర్ వన్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.అవకాశం వచ్చినప్పుడల్లా చిన్న సినిమాకి మద్దతుగా దాసరి మాట్లాడుతూనే వున్నారు.అయితే ఇక్కడే ఓ చిక్కుంది.దాసరి తెగ పొగిడిన సినిమాలో అయన ఎప్పుడూ సురేష్ బాబు ఓభాగం.
థియేటర్ల విషయానికి వచ్చేసరికి అయన ఆ నలుగురు బడా నిర్మాతలపై అందులో ఒకడైన డి .సురేష్ బాబు మీద ఎన్నో సార్లు దాసరి ఫైర్ అయ్యారు .సురేష్ బాబు కూడా కౌంటర్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇక్కడ వ్యాపారం తప్ప ఇంకోటి లేదని సురేష్ తేల్చేశారు.అయితే ఇవేమీ పట్టించుకోకుండా దాసరి పెళ్లి చూపులు ని ఆకాశానికి ఎత్తారు.బాబుబంగారం ఆడియో ఫంక్షన్లోనూ వెంకటేష్ ను బాగా మెచ్చుకున్నారు.ఇదంతా చూస్తుంటే ఇద్దరి మధ్య మళ్లీ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అనుకోవాలా? లేక సినిమాని …వ్యక్తిగతాన్ని వేర్వేరుగా చూసే పరిణితి అనుకోవాలా ? ఛాయస్ ఈస్ యూవర్స్..