బాహుబలి డెడ్ లైన్ ఎప్పుడంటే..!

0
342
Dead Line Fix For Bahubali Shooting

Posted [relativedate]

Dead Line Fix For Bahubali Shootingదాదాపు నాలుగు సంవత్సరాలుగా ఒక్క సినిమా కోసం కష్టపడుతున్న బాహుబలి చిత్రయూనిట్ కు ఎట్టకేలకు న్యూస్ ఇయర్ నుండి విడుదల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు పూర్తయిన సినిమా షూటింగ్ ఈ నెల 27న మొత్తం కంప్లీట్ అవుతుందట. ముఖ్యంగా ప్రభాస్ డిసెంబర్ 27న బాహుబలికి గుడ్ బై చెప్పేస్తున్నాడట. ఇక సినిమాకు కూడా డిసెంబర్ 31న గుమ్మడికాయ కొట్టేస్తాడని అంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన మొదటి పార్ట్ సంచలన విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు సెకండ్ పార్ట్ అదే బాహుబలి కన్ క్లూజన్ మీద అందరి దృష్టి ఉంది. ఏప్రిల్ 28, 2017లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఓ పక్క స్పీడ్ గానే కానిచ్చేస్తున్నారు. షూటింగ్ ఎలాగు పూర్తవుతుంది కాబట్టి ఇక జక్కన్న ఫుల్ కాన్సెంట్రేషన్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పెడతాడు. తెలుగు సినిమా చరిత్రను దశ దిశలా వ్యాపింప చేసిన బాహుబలి కన్ క్లూజన్ మీద కూడా అదే రేంజ్ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply