‘డియర్ జిందగీ’ ఫస్ట్ ఇంప్రెషన్..

0
527

ఆకట్టుకుంటున్న 'డియర్ జిందగీ' ఫస్ట్ లుక్dear-zindagi- - Copyఆకట్టుకుంటున్న 'డియర్ జిందగీ' ఫస్ట్ లుక్Dear-Zindagi-First-Look

2012లో శ్రీదేవి లీడ్‌లో ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ తెరకెక్కించి సూపర్ హిట్ కైవసం చేసుకున్నారు డైరక్టర్ గౌరీ షిండే. ఆ తర్వాత ‘డియర్ జిందగీ’తో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారామె. ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అలియా ట్విట్టర్‌లో షేర్ చేసుకుంది. షారుక్‌తో కలిసిన ఉన్న ఫొటోకు ఆర్ట్ టచ్‌ ఇస్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లకు షారుక్‌ కూడా సరదా సమాధానాలిచ్చారు. వీరి ఫొటోలు, ట్వీట్స్‌ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

‘డియర్ జిందగీ’ని షారుక్ తమ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై ధర్మ ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా సాధారణ ప్రేమ కథ కాదని గౌరీ షిండే చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని అంటున్నారు.

Leave a Reply