దీప క‌థ ముగిసిన‌ట్టేనా?

 Posted March 25, 2017

deepa jayakumar followers jump in o panneerselvam side for rk nagar by elections
తమిళ‌నాడులోకి ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో అమ్మ మేన‌కోడ‌లు… దీపా జ‌య‌కుమార్ ను బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ప్ర‌ధాన‌పార్టీలు భావిస్తున్నాయి. జ‌య మేన‌కోడ‌లిగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. స‌పోర్ట్ చేసే అనుచ‌ర గ‌ణం కూడా ఉంది. అయితే అనుకూల‌త‌ను క్యాష్ చేసుకోవ‌డంలో ఆమె విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ వాద‌న వినిపిస్తోంది.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకేకు చెందిన కొంత‌మంది యువ కార్య‌క‌ర్త‌లు… దీపపై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అమ్మ రేంజ్ లో ఆమె అండ‌గా ఉంటార‌ని భావించారు. అందుకే ఆమెపేరుతో దీపా పేర‌వై అభిమాన సంఘం పెట్టేశారు. గ‌త రెండునెల‌లుగా ఆ సంఘం ప్ర‌జలను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ముఖ్యంగా దింగ‌ల్ జిల్లా చిన్న‌ల్ ప‌ట్టిలో ఈ సంఘానికి మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. అయితే దీప‌ కోసం ఇంత చేస్తున్నా… ఆమె మాత్రం ఈ సంఘాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. దీంతో స‌ద‌రు సంఘం నాయ‌కులు విసుగు చెందారని టాక్. ఇప్ప‌టికే కొంత‌మంది ఆ సంఘాన్ని వీడి ప‌న్నీర్ సెల్వం పంచ‌న చేరిపోయారు. తాజాగా ఆ సంఘం నాయ‌కులు… దీపా పేర‌వైని పూర్తిగా ర‌ద్దు చేసి… దీప‌కు పెద్ద షాకే ఇచ్చారు. అంతేకాదు సెల్వంకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో దీపా పేర‌వై సంఘంపైనే ఆమె ఆశ‌లు పెట్టుకున్నార‌ట‌. ఒక్క‌సారిగా ఆ సంఘాన్నిరద్దు చేసి… వారంతా సెల్వం వ‌ర్గంలోకి జంప్ అయిపోవ‌డంతో ఇప్పుడామె ఒక్క‌సారిగా డిఫెన్స్ లో ప‌డిపోయారు. త‌న త‌ర‌పున క్యాంపెయిన్ చేయ‌డానికి ప్ర‌ధాన మ‌ద్ద‌తుదారుల‌ను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఆమెకు వ‌చ్చింది.

ఇది క‌చ్చితంగా దీప‌కు మైన‌స్సేనంటున్నారు విశ్లేష‌కులు. దీపా పేర‌వైను బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా మ‌ల‌చ‌డంలో.. ప్ర‌జాభిమానాన్ని సాధించ‌డంలో దీప విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న వినిపిస్తోంది. ప‌రిస్థితి ఇలాగే ఉంటే..ఎన్నిక‌ల్లోనూ దీప ఫ్యాక్ట‌ర్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు. అందుకే ఇప్ప‌టికైనా ఆమె మేల్కొంటారా? లేక మేన‌త్తలా ప‌దునైన వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తారా? ప‌డిలేచిన కెర‌టంలా స‌త్తా చాటుతారా? అన్న‌ది నెల‌రోజుల్లోనే తేలిపోనుంది.

SHARE