Posted [relativedate]
అధికారం కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం,ఒకరినొకరు చంపుకోవడం,చివరికి తల్లిదండ్రుల్ని సైతం మృత్యు ఒడికి చేర్చడం….ఇవన్నీ చరిత్రలో ఎప్పుడోకప్పుడు చూసినవే…ఎవరో ఒకరు చేసినవే.రాజకీయం ముందు రక్తసంబంధాలు పలచబడిన ఘటనలు కోకొల్లలు.ఇక పిల్లల మీద ప్రేమ కొద్దీ తల్లిదండ్రుల హోదాలో ఆలుమగలు విభేదించిన విషయాలు పురాణాల్లోనే వున్నాయి. రామాయణంలో రాముడిని అడవికి పంపిన ఘటన అందుకో ఉదాహరణ. ఇక జక్కన్న అద్భుత సృష్టి బాహుబలిలోనూ అధికారం అప్పగింతపై శివగామి,బిజ్జలదేవుడు విభేదించడం చూసాం.అయితే చరిత్రకి ,ఊహకి అందని విధంగా అధికారం కోసమే భార్యాభర్తలు ఘర్షణ కి దిగిన సందర్భాలు ఎక్కడా కానరావు.మాయదారి రాజకీయం,అధికారం ఇప్పుడు ఆ పని కూడా విజయవంతంగా చేసేశాయి.ఈ ఘటనకు తమిళనాడే వేదికైంది.
జయ మేనకోడలు రాజకీయ రంగప్రవేశం ఆమె దాంపత్యంలో చిచ్చు పెట్టేట్టు వుంది.”ఎంజీఆర్ అమ్మ దీప పెరవై” పేరుతో ఆమె ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు.అందులో ఆమె భర్త మాధవన్ కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే.ఆ తరువాత రాజకీయ పరిణామాల్లో పన్నీర్ సెల్వం వైపు దీప మొగ్గుజూపారు.కానీ నో యూజ్.ఇప్పుడు ఆర్కే పురం అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడేందుకు దీప డిసైడ్ అయ్యారు.అయితే ఆ వ్యూహ రచనలో భార్యాభర్తల మధ్య గొడవొచ్చింది.అది బయటపడకుండా చూడాలని దీప చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.మాధవన్ ఏకంగా జయ సమాధి వద్దకెళ్లి దీపని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని,అందుకే ఆమెతో రాజకీయ ప్రయాణం చేయబోనని ప్రకటించారు.అంతటితో ఆగకుండా సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.ఇది చూస్తుంటే దట్ ఈజ్ రాజకీయం అనిపించింది. అతడిని ఆమెకి దూరం చేసింది.