కోడిపుంజుపైనే దీప ఆశలు!!

0
485
deepa jayakumar trying to get her party symbol bantam

Posted [relativedate]

deepa jayakumar trying to get her party symbol bantam
ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న దీప విజయం కోసం ఇప్పట్నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. చిన్నమ్మ వర్గాన్ని చిత్తు చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సెల్వం, స్టాలిన్ తో ఆమె టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్కే నగర్ లో శశికళను నిలువరిచేందుకు కొత్త ఎత్తులు వేసే ప్రయత్నాల్లో దీప ఉన్నారట.

ఆర్కే నగర్ లో శశికళ వర్గం నుంచి దినకరన్ పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బలమైన దినకరన్ ఢీ కొట్టేందుకు దీప రెడీ అవుతున్నారు. ఈ పోరులో ఎన్నికల గుర్తు కూడా కీలకమే. కాబట్టి గతంలో తన మేనత్త జయలలితకు అచ్చివచ్చిన కోడిపుంజు గుర్తువైపు ఆమె మొగ్గు చూపుతున్నారని టాక్.

గతంలో ఎంజీఆర్ మరణం తర్వాత రెండాకుల గుర్తుపై అటు జానకీ రామచంద్రన్.. ఇటు జయలలిత పట్టుబట్టడంతో ఎన్నికల కమిషన్ రెండు వర్గాలకు కూడా ఆ గుర్తును కేటాయించలేదు. దీంతో మరోదారిలేక జయ .. కోడిపుంజు గుర్తుపైనే గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత రెండాకుల గుర్తును ఆమె సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు దీపకు రెండాకుల గుర్తు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ గుర్తు కోసం శశికళ, సెల్వం వర్గాలు పోరాడుతున్నాయి. కనుక తాను గతంలో జయకు కలిసొచ్చిన కోడిపుంజు గుర్తును ఎంచుకునేందుకు దీప సిద్ధమవుతున్నారట. ఎలాగైనా ఆ గుర్తును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. మరి దీప విజ్ఞప్తిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తుందా? నిజంగానే ఆ కోడిపుంజు గుర్తు తనకు దక్కితే దీప సత్తా చాటుతారా? అన్నది చూడాలి!!

Leave a Reply