ఆ యంగ్ హీరో చేతిలో బాలకృష్ణ అవుట్ ..

  deepak saroj bowling balakrishna hero
లవ్ కే రన్ చిత్రం ట్రైలర్ లో పెద్దపెద్ద డైలాగ్స్ చెప్తున్న ఓ కుర్ర హీరో గుర్తున్నాడా ? ఆ అబ్బాయి పేరు దీపక్ సరోజ్ .విశాఖ కి చెందిన ఈ యువకుడు లవ్ కే రన్ తో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.అయితే అంతకు ముందే చాలా సార్లు వెండితెర మీద బాలనటుడిగా మెరిశాడు.42 సినిమాల్లో బాలనటుడిగా చేసిన దీపక్ మిణుగురులు సినిమాతో క్రిటిక్స్ ని కూడా మెప్పించాడు.

లెజెండ్ సినిమాలో చిన్నప్పటి బాలకృష్ణ పాత్ర పోషించాడు.ఆ సినిమా షూటింగ్ టైం లో చిత్ర యూనిట్ సరదాగా క్రికెట్ ఆడింది.ఆ టైంలోమనోడు వేసిన బంతికి బాలకృష్ణ అవుట్ అయ్యాడంట.ఆ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకుని మరీ తాజా చిత్రం ప్రొమోషన్స్ కోసం ఇస్తున్న ఇంటర్వ్యూ ల్లో చెప్తున్నాడు.

SHARE