దీపిక కి అతనితో పనిచేయాలని ..

  deepika want to act yash chopraబాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకోన్ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇంత పాపులారిటీ వచ్చాక కూడా ఆమెకు తీరని కల ఒకటుందట. లెజెండరీ నిర్మాత యశ్‌చోప్రాతో కలిసి నటించాలన్నది ఆమె డ్రీమ్. ఆయనకి కూడా తనంటే అభిమానమని, ఎప్పటికైనా యశ్‌జీతో కలిసి పనిచేయాలనుకున్నాననీ అది తీరలేదని దీపిక వెల్లడించింది. మీరు రణ్‌బీర్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌లతో కలిసి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే ఏంచేస్తారు అనే ప్రశ్నకి.. ‘‘ఇద్దరూ బెస్ట్‌ డ్యాన్సర్లు. కాబట్టి వారిద్దరి మధ్య నేను డ్యాన్స్‌ చేస్తాను’’ అని టక్కున చెప్పింది. మరి అందులో కత్రినాకైఫ్‌, అనుష్క శర్మ ఉంటే ఏం చేస్తారని అడిగితే.. బొమ్మరిల్లు ఆట ఆడుకుంటూ.. మంచి వంటకాలు వండి ఫ్రెండ్స్‌ అందరినీ పిలుస్తా’’ అని చెప్పుకొచ్చిందీ సొగసరి

SHARE