ఢిల్లీ గవర్నర్ రాజీనామా….

Posted December 22, 2016

delhi Governor Najeeb Jung Resignation  ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా చేశారు. యూపిఏ హయాంలో 2013 జులైలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రభుత్వానికి, లెఫ్టెనెంట్ గవర్నర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఏడాదిన్నర పదవీకాలం ఉండగానే జంగ్ రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు. ఆయన తిరిగి విద్యారంగానికి వెళ్తారని భావిస్తున్నారు. ప్రధానికి, సిఎంకు, ప్రజలకు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు.

SHARE