అక్కడ ముఖ్యమంత్రులే ప్రతిపక్షనేతలు..

0
590

  delhi janthar manthar chief minister converted opposition leadersKEGRREEE     

జంతర్ మంతర్.. పేరుకు తగ్గట్టే ఢిల్లీ లోని ఆ సెంటర్ ప్రత్యేకం.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికొచ్చేసరికి ప్రతిపక్షనేతలు అయిపోతారు.. ఎందుకో తెలుసా..? అదీ కేంద్ర ప్రభుత్వం మీద నిరసన గళాన్ని విన్పించేందుకు విపక్షాలు వాడుకునే వేదిక.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ్నుంచే తమ డిమాండ్ ల కోసం ఉద్యమించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిలదీశారు.. ప్రశ్నించారు.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ వేదికను బహుబాగా ఉపయోగిస్తారు. పక్కనే వుందికదా… కేంద్రంపై ఎప్పుడు కోపం వస్తే అప్పుడే అక్కడ ప్రత్యక్షమైపోతారు.. NDA , UPA , భాగస్వామ్యపక్షాలు కూడా తమకు అనుకూలంగా లేని పార్టీ కేంద్రంలో సారధ్యం వహిస్తుంటే ఇక్కడి నుంచే సమర శంఖం పూరిస్తాయి.

KK      తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలకు పరాకాష్టగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసిందిక్కడే.. ఇక్కడ జరిగిన దీక్షల్లోఆయన రూటు మాత్రం సెపరేట్.. అందరూ విపక్షం మీద ఇక్కడ నుంచి పోరాడితే.. ఆయన మాత్రం స్వపక్షం మీదే పోరాడారు… అది కూడా ఓ జాతీయ పార్టీ తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అదే పార్టీ నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపించారు… అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ పై ఇంత బహిరంగంగా తిరుగుబాటు చేసింది బహుశా ఈయనే కావచ్చు.

KCRRRR       ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఇపుడు ఇదే వేదికపై నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి KCR కేంద్ర ప్రభుత్వం పై సమర శంఖం పూరించాలని యోచిస్తున్నారు… రాష్ట్ర హైకోర్టు విభజన ఆలస్యం కావడం,జడ్జీలకు ఆప్షన్ విధానం వంటి అంశాలపై KCR ఆగ్రహంతో రగిలిపోతున్నారు.. ఈ సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆయన పోరాట పంథాకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఉద్యమ సమయంలో KCR నోటిమాటకున్న పదునేంటో చూశాము.. ఉద్యమం చల్లారిపోతుందనుకున్నప్పుడల్లా నోటిమాటలతోనే వేడిరగిల్చిన ఘనత ఆయన సొంతం… ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార శైలిలో చాలా మార్పులు కన్పిస్తున్నాయి. CM పీఠం అధిష్టించిన తొలినాళ్లలో కొన్ని పత్రికలు, చానెళ్ల మీద.. MLC ల కొనుగోలు కేసు సందర్భంలో చంద్రబాబు మీద కాస్త దూకుడు ప్రదర్శించారు. తరువాత ఆ తరహా వాఖ్యలు ఎక్కడాకన్పించలేదు. అయితే ఇన్నాళ్ళకు మళ్లీ KCR ఓ సమస్యపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.. అది కూడా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీద.. ఈ ఘట్టానికి కూడా జంతర్ మంతర్ వేదిక అయ్యే అవకాశం ఉంది.. చూద్దాం.. జంతర్ మంతర్ లో KCR స్వరం ఏ రేంజ్ లో విన్పిస్తుందో.? కేంద్రం ఎలా స్పందిస్తుందో..?

Leave a Reply