డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి..నివారణకు చర్యలేంటి..?

dengue fever symptomsడెంగీ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. డెంగీకి ప్రత్యేకమైన మందులు లేవని, లక్షణాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని అల్లోపతి వైద్యులు పేర్కొంటున్నారు. ఏ వైద్య విధానంలోనైనా డెంగీకి పెద్ద చికిత్స లేదని, దీనికి కూడా సాధారణ జ్వరంలాగా నే వైద్యం చేయాలంటున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు సరైన సమయంలో చికిత్స అందించాలి.

డెంగీ లక్షణాలు…
జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 ఫారెన్‌హీట్‌.తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులుకళ్లలో విపరీతమైన నొప్పిశరీరంపై దద్దర్లువాంతులు కావడం, కడుపునొప్పినోరు ఆరిపోవడం, విపరీతమైన దాహంకొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి…?
చలితో విపరీతమైన జ్వరం వచ్చిన వెంటనే అనుభవం ఉన్న వైద్యులను కలవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ యాస్ర్పిన్‌, బ్రూఫిన్‌ మాత్రలు వాడకూడదు.జూప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టి పని ఆగిపోతుంది. అందుకే డెంగీ జ్వరం ఉన్నప్పుడు నొప్పుల నివారణ కోసం ఎన్‌ఎస్‌ఏఐడీ ఉన్న మాత్రలు వాడకూడదు.పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రో‌లైట్స్‌ అధికంగా ఉన్న ద్రవాలను మాత్రమే తీసుకోవాలి.ప్లేట్‌లెట్స్‌ జీవిత కాలం ఒక్కరోజే. అది శరీరంలో నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. డెంగీ జ్వరం ఉన్నప్పుడు శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు అవసరం అయితేనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి.జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి. చల్లని ప్రదేశంలో రోగిని పడుకోబెట్టాలి. పారాసెట్మాల్‌ మాత్రను వెంటనే ఇప్పించాలి. శరీర ఉష్ణోగత్ర తగ్గేందుకు చేయాల్సిన అన్ని చర్యలు చేయాలి.దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్‌, లిక్విడ్‌ లాంటివి వాడాలి. దోమకాటు లేకుండా దోమ తెరలు వాడాలి.

డెంగీ నివారణకు నెటిజన్ల సూచనలు
డెంగీ నివారణకు నెటిజన్లు తమదైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్స్‌అ్‌పలో డెంగీ, దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన గృహ చిట్కాలను అందరికీ చేరవేస్తున్నారు. అందులో కొన్ని…
నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 10-15 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాపిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి.క్యారెట్‌ జ్యూస్‌, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది.కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది.⁠⁠⁠⁠

Leave a Reply