జగన్ పై కేఈ ఎదురుదాడి.. బుల్లెట్ పాయింట్స్

 • deputy cm krishna murthy counter attack jagan
 • దోచుకొని దాచుకొనే జగన్ కి ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమి తెలుసు?
  ప్రత్యేక హోదా గురించి అసత్యాలు చెబుతూ యువతని తప్పు దోవ పట్టించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ ముసల కన్నీరు కారుస్తున్నారు.
 • ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రాన్న రావణకాష్టంలా మార్చాలన్నదే జగన్ లక్ష్యం. ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సుని ద్రుష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత కోరుతున్నారు.
 • ప్రజల విశ్వాసమే కాదు సొంత పార్టీ నాయకుల విశ్వాసం కోల్పోయిన జగన్ ఓ సైకోలా మారిపోయారు. అలాంటి సైకోకి కేంద్రం ఇస్తున్న ఆర్థిక ప్రయోజనాలు ఏమి తెలుసు. హోదా, ప్యాకేజీ అంటూ వీడియోలు చూపిస్తున్న జగన్…
 • తన తండ్రి హయాంలో రాష్ట్రాన్ని ఎలా దోచేసింది, క్విడ్ ప్రో కో లు ఎలా చేసింది కూడా చూపించి వుండాల్సింది
 • జగన్ వాడుతున్న భాష చూస్తుంటే అతను మానసికంగా ఇబ్బందులు పడుతూ మాటపై అదుపు కోల్పోయాడు. అత్తగారి సొత్తా అంటున్న జగన్ ఎవరి సొత్తు అని రాష్ట్రాన్నీ, సహజ వనరుల్ని దోచారూ చెప్పాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబునీ, వెంకయ్య నాయుడిని విమర్శించే స్థాయి జగన్ కి లేదు.
 • విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ల ద్వారా ఎన్నో పరిశ్రమలు రావడమే కాదు… రాయలసీమలో ఎంతో అభివృద్ధికి ఆస్కారం కలుగుతుంది.
 • జగన్ ధోరణి చూస్తుంటే సీమ అభివృద్ధి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. ఆ పరిశ్రమల వల్ల ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి వస్తుంది అన్నది నిజం కాదా? హోదా కీ పారిశ్రామిక రాయితీలకీ సంబంధం లేదు అనే వాస్తవాన్ని తెలుసుకోవాలి.
 • రాష్ట్రం తీవ్ర వర్షాలు, వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతుంటే వారికి అందించాల్సిన సహాయం గురించి ప్రతిపక్షనాయకుడికి గుర్తుకు రాలేదా అని విమర్శించారు.
 • చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని, గ్లోబెల్స్ ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు.
  డిప్యటీ సి.ఎం కేఈ క్రిష్ణమూర్తి⁠⁠⁠⁠
SHARE