తెలంగాణలో డిప్యూటీ సీఎం పదవి అచ్చి రావడం లేదా..?

0
530
Deputy CM post gives a headache for Telangana KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎక్కడైనా డిప్యూటీ సీఎం పదవిస్తే ఎగిరి గంతేస్తారు. సీఎం తర్వాత సీఎం అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక్కడంతా రివర్స్ లో నడుస్తోంది. మిగతా మంత్రులందరి పదవులు సేఫ్ గా ఉంటాయి. కానీ డిప్యూటీ సీఎం పదవి మాత్రం ఊస్ట్ అయిపోతుంది. దీనికి గతంలో తాటికొండ రాజయ్య ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు మరో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా అదే బాటలో ఉండటం సెంటిమెంట్ కు బలం చేకూరుస్తోంది.

అప్పట్లో రాజయ్యకు వైద్యసీట్ల స్కామ్ చుట్టుకుంది. ఆయన అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో సీఎం కేసీఆర్ పర్సనల్ గా నిఘా పెట్టి.. విషయం కన్ఫామమ్ చేసుకుని రాజయ్య పోస్ట్ పీకేశారు. అప్పట్లో ఆయన సామాజిక వర్గానికి చెందిన సంఘాలు హడావిడి చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.

ఇప్పుడు మియాపూర్ ల్యాండ్ స్కామ్.. అటు తిరిగీ, ఇటు తిరిగీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మెడకు చుట్టుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు పూనుకున్న కేసీఆర్.. ఆ శాఖనే తానే నిర్వహించాలని యోచిస్తున్నారు. అందుకే మహమూద్ అలీ పోస్ట్ పీకేయాలని డిసైడయ్యారు. మైనార్టీల నుంచి నిరసనలు వచ్చినా తగ్గకూడదని గులాబీ బాస్ డిసైడైనట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఇది తిరుగులేని సంచలనం అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply