వై.ఎస్. సమాధికి దేశం నేత మొర..ఏమని?

 Posted October 31, 2016

desam senior at ys rajaekhar reddy graveవైసీపీ అధినేత జగన్ మీద ఫిర్యాదుకు ఓ టీడీపీ నాయకుడు సిద్ధమవుతున్నాడు.ఇంతకీ అయన ఫిర్యాదు ఎవరికి ఇస్తాడంటే? వై.ఎస్.సమాధికి కొడుకు జగన్ మీద ఫిర్యాదు చేస్తాడంట. ఈ టాపిక్ లోతుల్లోకి వెళితే…ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమమానికి మద్దతుగా నిలిచి టీడీపీ సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ వ్యూహరచన చేసింది.అందుకే నవంబర్ 16 నుంచి తలపెట్టిన ముద్రగడ పాదయాత్రకు వైసీపీ మద్దతు ఇస్తోంది.దానికి కౌంటర్ పాదయత్రకి దేశం నేత ,కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు సిద్ధమయ్యారు.

వై.ఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయ నుంచి రామాంజనేయులు పాదయాత్ర సాగుతుంది.ముద్రగడ పాదయాత్ర మొదలైన రోజే బలిజ శంఖారావం పేరుతో ఈ యాత్రకి శ్రీకారం చుడతారు. ముందుగా జగన్ మీద వై.ఎస్.సమాధికి వినతిపత్రం ఇస్తారు.అందులో ‘2004 ఎన్నికలకి ముందు రిజర్వేషన్ హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు.2009 లోను అదే పునరావృతం అయ్యింది .2014 లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కాపు ,బలిజ రిజర్వేషన్ ల కోసం ప్రయత్నాలు మొదలెడితే ముద్రగడని అడ్డం పెట్టి వాటి ఫలాలు అందకుండా జగన్ అడ్డుపడుతున్నారు .మీ సమాధి వద్దకి వచ్చినపుడు జగన్ కి కాస్త బుద్ధి చెప్పండి’….ఈ విధంగా వుండబోతోంది.ఏదేమైనా ఇప్పటిదాకా శవరాజకీయం గురించి విన్నాం ..ఇప్పుడు సమాధి రాజకీయం చూడబోతున్నాం.ఏం చేస్తాం.. అంతా రాజకీయం మహిమ .

SHARE