‘దేవా’దుల ఎప్పటికి..?

172

devadula lift irrigation
తెలంగాణలోని నాలుగు జిల్లాలకు సాగునీరందించే ఉద్దేశ్యంతో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. మూడు దశలలో పనులు పూర్తి చేసి 38.182 టిఎంసిల గోదావరి నీటిని ఎగువకు పంపింగ్ చేయాలని నిర్దేశించుకున్నారు. గడిచిన 12 సంవత్సరాలలో కేవలం మొదటి, రెండోదశ పైప్‌లైన్ నిర్మాణ పనులు మాత్రమే పూర్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, ప్రధాన కాలువలు, ఫీడర్ ఛానళ్లు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం, మూడోదశ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని ఎగువ ప్రాంతాలలో జూన్ మూడవ వారం నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఏటూరునాగారం మండలంలోని ఇంటెక్‌వెల్ వద్ద గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది.

ప్రభుత్వ అనుమతితో అ’దికారులు మొదటి, రెండో దశ మోటార్లను ప్రారంభించారు. మొదటి, రెండో, మూడో దశలోని అన్ని మోటార్లను ప్రారంభించే అవకాశాలు ఉన్న అధికారులు ఆ పని చేయలేదు. కొన్ని రోజులు మొదటి దశ, ఇంకొన్ని రోజులు రెండో దశ, మరికొన్ని రోజులు మూడోదశ ఇలా మోటార్లను మారుస్తూ భీం ఘన్‌పూర్ వరకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. బీం ఘన్‌పూర్ నుండి మాత్రం మొదటిదశ, రెండవ దశ మోటార్ల ద్వారానే దర్మసాగర్ రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ జరుగుతుంది. ఎగువ ప్రాంతాలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడం తగినంత ఆయకట్టుకు నీరందించే కాలవల నిర్మాణం పూర్తికాకపోవడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం గోదావరి ఇంటెక్ వెల్ వద్ద 83 అడుగులకు పైగా నీటి మట్టం ఉంది. 38.18 టిఎంసిల నీటిని పంపింగ్ చేసే మోటార్లు సిద్దంగా ఉన్నాయి. వీటితో 6.21 ల’ల ఎకరాలకు సాగునీరందించవచ్చు. అయినా ఈ ఏడాది 10 టిఎంసిలతో 1,50,000 ఎకరాలకు మాత్రమే సాగునీరందించాలని అ’దికారులు ల’్యంగా పెట్టుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 5.18టిఎంసిల నీటిని ఎత్తిపోయాలి. దీంతో 77,500 ఎకరాలకు సాగు నీరందిం చాలి. ఏటూరునాగారం ఇంటెక్ వెల్ నుండి స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఆర్ఎస్ ఘన్‌పూర్ వరకు 138.5కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేశారు. ఇందు కోసం 1319 కోట్ల రూపాయలు కెటాయించగా పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్యాకేజి 45 కింద 31,000 ఎకరాలకు సాగునీరందించాలని బాల్యం కాగా 153 కిలోమీటర్ల కాలువలు తవ్వాల్సి ఉంది.

1098 స్ట్రక్చర్ల నిర్మాణానికి గాను 932 మాత్రమే పూర్తి చేశారు. లైనింగ్ విషయానికి వస్తే ఇంకా నాలుగు కి.మీ దూరం పూర్తి చేయాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో గత ఏడాది కేవలం 15,700 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. దేవాదుల రెండవ దశ, మూడవ దశ పనుల కొనసాగింపులోను అ’దికారుల నిర్ల’్యం కొట్టిచ్చినట్టు కనపడుతుంది. రెండవ దశలో 7.25 టిఎంసిల నీటిని గోదావరి నుండి ఎత్తిపోయాలి. 1,79,200 ఎకరాలకు సాగునీరందిం అందిస్తారు. మొదటి దశ మాదిరిగానే ఇంటెక్ వెల్ నుండి ఆర్ఎస్ ఘన్‌పూర్ వరకు పైప్‌లైన్ నిర్మాణాలు కొనసాగాల్సి ఉంది. అక్కడి నుండి అశ్వరావు పల్లి వైపు అదనంగా మరో పైప్‌లైన్ అలాగే ‘దర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండి రామారం, తపాస్‌పల్లి, వెల్దండ వైపు 196.40 కి.మీ పైప్ లైన్ నిర్మాణం చేశారు. 2005 ఏప్రిల్‌లో పనులు మొదలు కాగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికి 11 సార్లు గడువు పెంచారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో కీలకమైన మూడోదశ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here