Posted [relativedate]
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా దేవీప్రసాద్ కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ కు చేదోడువాదోడుగా నిలిచారు. దేవీప్రసాద్ ది కూడా కేసీఆర్ సొంత జిల్లానే కావడంతో… ఫ్యూచర్ లో దేవీప్రసాద్ కు తిరుగులేదని అంతా భావించారు. అందుకే రిటైర్మెంట్ కు ఇంకా సమయం ఉన్నా… రిజైన్ చేసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్సీ బరిలో దిగారు. అయితే టీఆర్ఎస్ కు అంతగా పట్టులేని హైదరాబాద్ లో ఆయన బరిలో ఉండడంతో దేవీప్రసాద్ ఓడిపోవాల్సి వచ్చింది.
ఓడిపోయిన తర్వాత దేవీప్రసాద్ కు .. పార్టీ పరంగానైనా తగిన ప్రాధాన్యం లభిస్తుందని ఆశించారు. ఆ ఆశలు కూడా అడియాసలుగానే మిగిలిపోయాయి. ఉద్యమసమయంలో ఎంతో కష్టపడ్డా…. ఇప్పుడు టీఆర్ఎస్ లో మాత్రం ఆయన పక్కన బెట్టేశారన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడా ఆయన వాయిస్ వినిపించడం లేదు. చివరకు ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షుడిగానే ఆయన నెట్టుకు రావాల్సి వస్తోంది.
దేవీప్రసాద్ విషయంలో కేసీఆర్ దాకా వెళ్లిందట. ఆయన కూడా చూద్దాం అన్నారట… కానీ ఏ హామీ ఇవ్వలేదట. అయితే త్వరలోనే జరగనున్న పార్టీ ప్లీనరీలో…. దేవీప్రసాద్ కు ఏదైనా పార్టీ పదవి లభించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో కోదండరామ్ నుంచి దేవీప్రసాద్ కు ఆఫర్ వచ్చిందట. టీఆర్ఎస్ లో ఉండి.. ఇబ్బందులు పడడం ఎందుకు?… బయటకు వస్తే.. కలిసి పనిచేద్దామని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ తో దేవీప్రసాద్ కూడా డైలమాలో పడిపోయారని టాక్.
టీఆర్ఎస్ లో ఉంటే న్యాయం జరుగుతుందో లేదో తెలియదు. కోదండరాం తో వెళ్తే మళ్లీ అనునిత్యం పోరు చేయాల్సిందే. ఈ వయస్సులో ఉద్యమాల పేరుతో మళ్లీ రోడ్డెక్కడం అవసరమా అని దేవీప్రసాద్ కు ఆయన సన్నిహితులు సూచిస్తున్నారట. దీంతో ఏది తేల్చుకోవాలో తెలియక ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారట. ఈ విషయం మంత్రి హరీశ్ రావు దృష్టికి వెళ్లిందట. కేవలం రెండు నెలలు వేచి చూడాలని కోరారట హరీశ్. దీంతో దేవీప్రసాద్ టీఆర్ఎస్ కు 2 నెలలు టైమ్ ఇచ్చారట. ఆలోపు తగిన గౌరవం లభించకపోతే…కోదండరామ్ తో కలిసి పోరు చేయడానికి దేవీప్రసాద్ సిద్ధంగా ఉన్నారని టాక్. మరి ఇప్పటికైనా కేసీఆర్… దేవీకి తగిన గుర్తింపునిస్తారా?… లేకపోతే కోదండరామ్ లా ఆయనను కూడా వదులుకుంటారా.. వేచిచూడాలి.