దేవి శ్రీకి మగాళ్ళు పనికిరారా..!

Posted November 4, 2016

vd1ఏంటండి బాబు దేవి శ్రీ ప్రసాద్ కి మగాళ్లు పనికి రాకుండా పోవడం ఏంటి.. సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీకి అసలు మగాళ్లు పనికి రాకపోవడం ఏంటి అని టైటిల్ చూసిన దగ్గర నుండి మనసులో ఏవేవో ఆలోచనలు కదా ఎబ్బే ఏం లేదండి.. మ్యూజిక్ డైరక్టర్ దేవి మల్టీ టాలెంటెడ్.. ఆ విషయం మనకు తెలుసు. మ్యూజిక్ డైరక్టర్ అంటే మ్యూజిక్ మాత్రమే చేస్తాడు కాని దేవి పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం అబ్బో ఛాన్స్ ఇస్తే చాలు కాని హీరోగా కూడా ఇరగదీసేందుకు రెడీ.

అయితే అలాంటి దేవి దగ్గర మరో టాలెంట్ కూడా దాగి ఉంది. అదే ఫోటోగ్రఫీ.. రీసెంట్ గా తన టాలెంట్ అంతా లావణ్య త్రిపాఠి మీద చూపించిన దేవి ఇప్పుడు వేదికతో కూడా ఫోటో షూట్ జరిపాడు. ఓ పక్క రాక్ స్టార్ గా మ్యూజిక్ లో ఇరగదీస్తూనే మరో పక్క దేవి ఈ ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తున్నాడు. అయితే ఈ ఫోటో షూట్స్ ఏవో హీరోలతో కూడా పెట్టుకోవచ్చు కదా ఏం దేవి కెమెరా మగాళ్లకు క్లిక్ కొట్టదా అని జోకులేసుకుంటున్నారు. ఓ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ లా ఫోటో షూట్ తో దేవి అదరగొట్టేస్తున్నాడు లేండి. చూస్తుంటే మనవాడు సినిమాకు కెమెరామన్ గా కూడా పనిచేసే ఆలోచనలో ఉన్నాడేమో అని డౌట్ వస్తుంది తన టాలెంట్ చూస్తుంటే.

SHARE