పెదవిదాటిన మాట వెనక్కి తీసుకోలేమన్నది నిజం ..పైగా ఆ మాట ప్రపంచమంతా వినేట్టు మాట్లాడితే కనీసం బొంకడానికి కూడా అవకాశం ఉండదు.దాదాపు 20 ఏళ్ళు తరువాత సొంతగూడు తెలుగుదేశం లోకి వెళుతున్న దేవినేని నెహ్రూకి ఇదే అనుభవం ఎదురైంది.ఒకప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చంద్రబాబు వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు చేశారు.అయన నమ్మదగ్గ వ్యక్తి కాదని చెప్పాడు.
ఇప్పుడు విజయవాడలో చంద్రబాబుతో కలవాలని చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని నెహ్రు తెలిపారు.చంద్రబాబు లాంటి నేతతో కలిసి పని చేయడం అదృష్టమని..పట్టిసీమ పూర్తి చేయడంలో బాబు సమర్ధత అమోఘమని కొనియాడారు .ఇక జగన్ ప్రస్తావన తెస్తూ ఆయనకి అనుభవం,అవగాహన లేవన్నారు నెహ్రు.దీంతో వైసీపీ శ్రేణులకు ఎక్కడో మండింది.వెంటనే సోషల్ మీడియా లో నాడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చంద్రబాబు పై నెహ్రు మాట్లాడిన వీడియోస్ విరివిగా పోస్ట్ చేస్తున్నారు.నాటి మాటలకి ఇప్పటి పరిస్థితుల్లో జవాబివ్వడం నెహ్రూకి తలనొప్పిగా మారడం ఖాయం.
[wpdevart_youtube]s-fdG89Tm2o[/wpdevart_youtube]