దేవినేని మనోగతం..

  devineni nehru join tdp after press meetఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను, అవినాష్, నాకున్న ఫాలోవర్స్ మొత్తం కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వాతావరణంలో ఆయన ఆహ్వానించడం, ఇదొక శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. నేను కూడా ఒకటే చెప్పాను.. నేను పార్టీ ఏం చేశాను అనేది చూడండి. నాకు పార్టీ ఏం ఇచ్చిందనేది ఎప్పుడూ ఎదురుచూడను. పార్టీకి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాము మేము. దాని ప్రకారం రాజధానిలో చేసేటటువంటి కార్యక్రమాలలో, అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో పాటు ఉడతా భక్తిగా మా భాగస్వామ్యాన్ని మీతో పాటుగా మేము కూడా కలుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వెలకమ్ చేశారు.

ఆ విధంగా ఇవాళ మార్నింగ్ కాంగ్రెస్ పార్టీకి నేను రిజైన్ చేయడం జరిగింది. బాగా బాధాకరమైనప్పటికీ కూడా.. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను తప్పడడుగులతో నేను పెరిగాను. ఒక రాజకీయ నాయకుడిగా భవిష్యత్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అనుకోని పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ లోకి వెళ్లా. నాకైతే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లుంది. ఎందుకంటే జన్మతో ఉన్న పార్టీ కాబట్టి నాకు. కానీ అవినాష్ కి.. కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టాడు తన జీవితాన్ని. ఆ కాంగ్రెస్ తను విడిపోవాలంటే తనకు కొంచెం బాదే. అయినప్పటికీ తండ్రిగా నా వెంట ఫాలో అవుతూ.. స్టేట్ యూత్ కాంగ్రెస్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రిజైన్ చేశాడు. మేం ఏదో కాంగ్రెస్ పార్టీకి… దానిమీదేదో.. దీని మీదనో.. ఎవరి మీదనో కోపమో కాదు. ఉన్న పరిస్థితుల్లో నా వెనుక ఉన్నటువంటి వేలాది కార్యకర్తల భవిష్యత్ ఆలోచించి రాబోయే కాలంలో ఈ అమరావతి కేపిటల్ ఏరియాన్ని డెవలప్ మెంట్ మా భాగస్వామ్యం కూడా కొంచెం ఉండాలని చెప్పి నేను చేరడం జరిగింది.

తెలుగుదేశం నాకు పాత పార్టీయే. ఎందుకంటే 1982 మార్చి 22న ప్రాంతీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు మేముంది నలుగురమే. భాస్కరరావు, మహరథి, నేను, ఎన్టీ రామారావు గారు. ఇంకెవరూ లేరు ఆ రోజున. 29న కూడా ఈ రాష్ట్రం రెండు బస్సులు వేసుకెళ్లింది నెనొక్కడినే. ఎన్టీఆర్ ను ఏలూరు రోడ్డు నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చింది. ప్రతి పాయింట్ లోను కూడా నేను భాగస్వామినే. ప్రతి చిన్న పాయింట్ లో కూడా. ఆఖరికి జెండా గీసేటప్పుడు డ్రాయింగ్ లో కూడా నేను భాగస్వామినే. కాబట్టి నాకేమీ తెలుగుదేశం పార్టీ.. ఇదేదో కొత్త పార్టీ లేక ఇదో కొత్త అనుబంధమని నాకేమీ లేదు. ఇది నా సొంతిల్లే.

అప్పడప్పుడు కాంగ్రెస్ లో అనుకునేవాడ్ని ఇది నాకు అద్దిల్లా అని. కానీ టీడీపీ నాకు పునాదులతో కూడుకున్న ఇల్లు. ఈ రోజు నేను ఎట్లా అయితే ఫీలవుతున్నానో.. అవినాష్ కి కొత్త పార్టీ. అతను వ్యవస్థలో పనిచేశాడు. ఇవాళ ఒక ఏక వ్యక్తి పార్టీలో పనిచేయడానికి వస్తున్నాడు. నేను ఏకవ్యక్తిగా పార్టీలో పనిచేశాను. వ్యవస్థలోకి వెళ్లాను. కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యాను. అతను వ్యవస్థలో పనిచేసి వచ్చాడు. ఏకవ్యక్తి పార్టీలోకి వస్తున్నాడు. కాబట్టి అతను కొంతకాలం ఎందుకంటే కుర్రాడు కాబట్టి.. అడ్జస్ట్ అవుతాడు. తప్పకుండా అడ్జస్ట్ అవుతాడు.

నాకు ఇంకో జెండా ఎత్తడం ఇష్టం లేదు. వేరే జెండా కిందకి వెళితే ఇష్టం లేదు. వెళితే తెలుగుదేశంలోనే ఉండాలనేది నా ఉద్ధేశ్యం. నాది పార్టీలు మారే మనస్తత్వం కాదు. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినప్పుడు రెండు గంటలపాటు బాధపడ్డాను. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కూడా నేను పొరపాటు చేయలేదు. పార్టీ అంటే నాకు కన్నతల్లితో సమానం. దానికోసం రాత్రింబవళ్లు కష్టపడ్డా. పార్టీ నాకేమిచ్చిందని కూడా నేను ఆలోచించలేదు. పార్టీకి నేను చేయగలిగినంత చేస్తానని ఆలోచించా. ఆ విధంగా నాకేమీ గౌరవం తక్కువ చేయలేదు పార్టీ. నాకిచ్చే గుర్తింపు నాకు ఇచ్చింది. అవినాష్ ని స్టేట్ ప్రెసిడెంట్ ని చేసింది. ఐ యామ్ ఫుల్లీ సాటిస్ ఫైడ్ దట్ జాబ్. కాకపోతే మారిన రాజకీయ పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో నాతో కలిసి పనిచేసిన సహచరులందరికీ కొంత బాధ కలిగించినప్పటికీ.. మరి తప్పని పరిస్థితుల్లో.. నా పరిస్థితిని కూడా అర్థం చేసుకుని నా రాజీనామాను ఆమోదిస్తారని అనుకుంటున్నాను.

నా తత్వం ఏమిటంటే.. పార్టీకి నేను ఏమి చేశానన్నదే ఆలోచిస్తా. ఆ పార్టీ నాకేమి ఇస్తున్నారన్నది వాళ్లు నిర్ణయిస్తారు. నేను ఇంతవరకూ కూడా అదేవిధంగా సక్సెస్ అయ్యా.. ఎన్టీఆర్ దగ్గరు నుంచి ఇప్పటివరకూ నేను చేయిచాచి ఎవర్నీ ఏమీ అడగలేదు. వాళ్లంతట వాళ్లే.. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా నాకొద్దన్నా కూడా లీడర్ షిప్ ఇచ్చింది. నాకిది కావాలని నేను అడగను. నాది నేను ప్రూవ్ చేసుకుని, పార్టీకి వీడు నిలబడతాడురా, పార్టీకోసం ప్రాణాలు ఇస్తాడనేది వాళ్లు అనుకుని వాళ్లు నిర్ణయించాలే తప్పితే.. నేను పార్టీకి ఏం చేశాననేది చూస్తాను తప్పితే నాకు పార్టీ ఏం చేసిందనే ఆలోచన చేయను. సెప్టెంబర్ 15న ఆఫీషియల్ గా జాయిన్ అవుతా : దేవినేని నెహ్రూ.

SHARE