Posted [relativedate]
విజయవాడ లో కీలకభూమిక పోషించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రు కన్నుమూశారు.హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. 4 .25 ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నెహ్రూ ఆసుపత్రి నుంచి రెండు రోజుల కిందటే డిశ్చార్జ్ అయ్యారు.ఇంతలో ఇలా ఊహించని విధంగా మృత్యువు ఆయన్ని కబళించింది.
విద్యార్థి రాజకీయాలతోనే విజయవాడలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నెహ్రూ టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ లో కీలకంగా,ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితంగా మెలిగారు.కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.నాలుగు సార్లు దేశం అభ్యర్థిగా,ఓ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా కంకిపాడులో నెహ్రు గెలిచారు.ఎన్టీఆర్ హయాంలో ఓ సారి మంత్రిగా కూడా పనిచేశారు.ఎన్టీఆర్ మరణించేదాకా నెహ్రూ ఆయన వెన్నంటే వున్నారు.ఆయన చనిపోయాక నెమ్మదిగా లక్ష్మీపార్వతితో దూరమై కాంగ్రెస్ లో చేరారు.రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ దెబ్బతినడంతో ఇటీవలే ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో సహా టీడీపీ లో చేరారు.