దేవినేని నెహ్రు …ఉండవల్లి అరుణ్ కుమార్ ….కారణాలేమైనా ఈ ఇద్దరు నేతలకి రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం వుంది.అలాంటి నేతలిద్దరూ దాదాపు ఒకే టైం లో కొత్తగూటికి చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.అయితే ఈ ఇద్దరూ బద్ధవైరమున్న రెండు పార్టీల్లో చేరడానికి డిసైడ్ అయిపోయారట.చర్చలు,హామీలు అన్నీ పూర్తి అయినట్టేనంట.ఇక ముహూర్తం మాత్రమే మిగిలివుంది.
దేవినేని టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.కాంగ్రెస్ నేతలు ఆయన్ని ఆపడానికి చివరి ప్రయత్నాలు సాగిస్తున్నా అయన సున్నితంగానే నో చెప్పారట.తన అభిప్రాయాల కోసం కొడుకు భవిష్యత్ పాడుకాకూడదనే నెహ్రు దేశం వైపు మొగ్గారట.చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసే అయన పుత్రవాత్సల్యం వల్లే పాతగూటికి చేరబోతున్నారట.లోకేష్ తో జరిగిన చర్చల్లోనూ కొడుకు గురించే అడిగారట.
ఇక ఉండవల్లి కొద్దిరోజులుగా చంద్రబాబు సర్కార్ పై రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు.తన నాయకుడు వైస్ కుమారుడు జగన్ పార్టీలో అయన చేరడం ఖాయమైపోయిందట.ఆయనకి అప్పంగించబోయే బాధ్యతలు కూడా బాబు సర్కార్ ని ఇరుకున పెట్టడమేనని సమాచారం.ఏమైనా కొత్త చోట ఈ నేతలు ఎలా నెట్టుకొస్తారో చూడాలి