టీడీపీ జెండా కప్పుకొనే…నెహ్రూ మాట నిజమైంది

0
690
devineni nehru wish tdp flag in his body after died

Posted [relativedate]

devineni nehru wish tdp flag in his body after died
” రాజకీయంగా టీడీపీ లో పుట్టాను.ఎన్టీఆర్ నాకు రాజకీయ బిక్ష పెట్టారు .చనిపోయినా టీడీపీ జెండా కప్పుకునే చనిపోతా.ఆ కోరిక తీరడానికే మళ్లీ ఈ పార్టీ లో చేరానేమో”…ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరుతూ భావోద్వేగంతో నెహ్రూ మాట్లాడిన మాటలు ఇవి. రాజకీయ ఓనమాలు దిద్దిన టీడీపీ లోకి సుదీర్ఘ కాలం తర్వాత చేరబోతున్న టైం లో నెహ్రూ ఇలా భావోద్వేగానికి లోను కావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు.రాజకీయాల్లో ఇంత ఎమోషనల్ పర్సన్స్ వుంటారా అని డౌట్ ఉంటే ..ఆ సందేహాన్ని తీర్చే సమాధానమే నెహ్రూ.

ఎన్టీఆర్ తో ఆదినుంచి అనుబంధం పెంచుకున్న నెహ్రూ నడకని చూస్తే చాలు . టీడీపీ సంక్షోభం సమయంలో మహామహులంతా చంద్రబాబు చెంతకు చేరినా నెహ్రూ మాత్రం ఎన్టీఆర్ వెంటే వున్నారు.ఎన్టీఆర్ తుది శ్వాస విడిచేదాకా ఆయన అడుగుజాడల్లోనే నడిచారు.ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా లక్ష్మీపార్వతి దగ్గరే ఉండి 1996 లో ఎన్టీఆర్ టీడీపీ తరపున విజయవాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.ఓడిపోతానని ముందుగానే తెలిసినా ఎన్టీఆర్ కి ఇచ్చిన మాట కోసం లక్ష్మీపార్వతి వైఖరి నచ్చకపోయినా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.ఎన్టీఆర్ మీద అభిమానంతోనే చంద్రబాబు వ్యతిరేక వ్యాఖ్యలు,రాజకీయాలు చేశారు.అయినా ఆయన ఏ విమర్శ చేసినా బాబు మీద చేసారేమోగానీ,టీడీపీ మీద ఎప్పుడూ నోరు జారలేదు.చివరకు వై.ఎస్ జమానాలో కూడా ఆయన ఈ ఫార్ములా తప్పలేదు.దీంతో టీడీపీ అంటే ఆయనకి ఎంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు.అందుకే టీడీపీ జెండా కప్పుకునే చనిపోతా అన్నారు.అన్నట్టే ఆ పార్టీ లో చేరాకే కన్నుమూశారు.

Leave a Reply