‘ధర్మయోగి’ రావడం లేదు.. ఎందుకంటే ?

 Posted October 28, 2016

dhanush dharmayogi movie release postponedతమిళ్ స్టార్ ధనుష్ కి టాలీవుడ్ లోనూ చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది.దీంతో.. ధనుష్ ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.ఆయన తాజా చిత్రం ‘కోడి’. ఆర్.ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోడీ’ కోలీవుడ్ లో ఇప్పటికే రిలీజైంది.ధనుష సరసన త్రిష,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పుడీ చిత్రాన్ని ‘ధర్మయోగి’గా తెలుగులోకి తీసుకొస్తున్నారు.

దీపావళి కానుకగా ఈరోజు (అక్టోబర్ 28)న ‘ధర్మయోగి’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.అయితే,ఆఖరి నిమిషంలో ధర్మయోగి రాకని నిలిపివేసినట్టు సమాచారమ్.ఇందుకు సాంకేతిక కారణాలే కారణమని తెలుస్తోంది.ఒక్కరోజు ఆలస్యంగా అంటే..రేపు (అక్టోబర్ 29) ధర్మయోగి రానున్నాడు.

SHARE