కన్న తల్లిదండ్రులను ఒప్పుకోని ఈయన హీరోనా?

0
326
dhanush is not accepting his own parents

Posted [relativedate]

dhanush is not accepting his own parents
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు ధనుష్‌ తమ కొడుకు అంటూ కదిరేశన్‌ దంపతులు గత కొన్నాళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. వారితో ఇప్పటి వరకు ధనుష్‌ మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. కనీసం వారు తన తల్లిదండ్రులు కాదు, తాను వారికి పుట్టలేదు అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం లేదు. కదిరేశన్‌ దంపతులు చెప్తున్న ఆనవాళ్లు చూస్తుంటే ఖచ్చితంగా ధనుష్‌ వారి కొడుకు అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ధనుష్‌ ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలను లేజర్‌ చికిత్స ద్వారా తొలగించడమే అందుకు నిదర్శనం అంటున్నారు.

కదిరేశన్‌ తాజాగా మాట్లాడుతూ ధనుష్‌ వారు నా తల్లిదండ్రులు కాదని ఒక్క ప్రకటన చేస్తే మళ్లీ ఆయన జోలికి వెళ్లం, న్యాయ పోరాటం కూడా విరమించుకుంటాం అంటున్నాడు. కదిరేశన్‌ ఇంత ఆఫర్‌ ఇచ్చిన తర్వాత ధనుష్‌ మీడియా ముందుకు వచ్చి తాను వారి కొడుకును కాదని, లేదా నేరుగా వారితో నేను మీ కొడుకును కాదు అని చెప్పినా సరిపోతుంది. కాని ధనుష్‌ అలా చెప్పడం లేదు అంటే, ధనుష్‌ వారి కొడుకు అని ఇక్కడే అర్థం అవుతుంది. కన్న తల్లిదండ్రులను ఒప్పుకోకుండా, కదిరేశన్‌ను తన తల్లిదండ్రులు అని ఒప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అనే ఉద్దేశ్యంతో ధనుష్‌ ఇలా చేయడం ఏమాత్రం మంచి పద్దతి కాదు. తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తిని ఈ సమాజం హీరో అంటూ గౌరవిస్తుంది. తల్లిదండ్రులను బాధ పెట్టే వాడు, వారికి గౌరవం ఇవ్వని వాడు హీరో ఎలా అవుతాడు. ఇప్పటికైనా ధనుష్‌ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Leave a Reply