కొలిక్కివచ్చిన ధనుష్ జన్మరహస్యం!!

Posted March 30, 2017

dhanush may relief dhanush parents case
సూపర్ స్టార్ రజినీకాంత్ కాంత్ అల్లుడు, హీరో ధనుష్… జన్మరహస్యం కేసు కొలిక్కి వచ్చిందా? కదిరేశన్ దంపతులతో కాంప్రమైజ్ జరిగిందా? అంటే ఔననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ధనుష్ తమ కొడుకేనంటూ కదిరేశన్ దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. ఫోటోలు, పుట్టుమచ్చలు, ఇతర ఆధారాలను సమర్పించారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. ధనుష్ కు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చూడాలని వైద్యబృందాన్ని ఆదేశించింది. అయితే లేజర్ చికిత్స ద్వారా ధనుష్ ..పుట్టుమచ్చలను తొలగించుకున్నాడని నిర్థారణ అయ్యిందట. ఇదే విషయంపై వైద్యబృందం నివేదిక తయారు చేసిందని సమాచారం. దీంతో ఒక్కసారిగా ధనుష్ డిఫెన్స్ లో పడిపోయినట్టయ్యింది.

వైద్య బృందం ఇచ్చిన షాక్ తో ధనుష్ దిద్దబాటు చర్యలకు దిగారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెర వెనక ఏం జరిగిందో? కానీ తమ అసలు కొడుకు దొరికాడంటూ కదిరేశన్ దంపతులు కొత్త వాదన వినిపిస్తున్నారట!! ధనుష్ తమ కుమారుడని పొరబడ్డామని చెబుతున్నారట. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేసిందని ప్రచారం జరుగుతోంది.

నిజం బట్టబయలవుతుందనే ఉద్దేశ్యంతో ధనుష్ తెర వెనక చక్రం తిప్పాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కదిరేశన్ దంపతులతో రాజీ కుదుర్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ దంపతులు ఇప్పుడు కొత్త రాగం వినిపిస్తున్నారట. ఈ కొత్త ట్విస్టుతో ఇక కేసు చిక్కుముడి వీడిపోయినట్టేనని ధనుష్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవముందో తేలాలంటే ఏప్రిల్ 11న న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే!!

SHARE