రైల్ మూవీ రివ్యూ..

Posted September 22, 2016

 dhanush rail movie review
చిత్రం : రైల్ (2016)
నటినటులు : ధనుష్, కీర్తి సురేష్
సంగీతం : ఇమాన్
దర్శకుడు : ప్రభు సాల్మన్
బ్యానర్ : ఆదిత్య మూవీ కార్పొరేషన్
నిర్మాత : ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి.కోలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ లోనూ రాణిస్తున్నారు. విక్రమ్, విశాల్, కార్తీ, సూర్య, విజయ్.. చిత్రాలకు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. వీరి చిత్రాలు ఏమాత్రం బాగున్నా టాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేయడం ఖాయం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య ’24’, కార్తీ-నాగ్ ల మల్టీస్టారర్ ‘ఊపిరి’ తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ ని కొల్లగొట్టాయి. తమిళ్ స్టార్ ధనుష్ కి కూడా టాలీవుడ్ లో క్రేజ్ ఉంది. ధనుష్ “రఘువరన్ బీటెక్” తెలుగు ప్రేక్షకులని అలరించింది. అయితే, ఆ తర్వాత రిలీజైన ధనుష్ (అనేకుడు, నవ మన్మథుడు) చిత్రాలు తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, తాజాగా, ‘రైల్’ చిత్రంతో మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిష్కించుకోవాలని చూస్తున్నాడు ధనుష్.

ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో ధనుష్-కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘తొడరి’. తెలుగులో ‘రైల్’గా వస్తోంది. గతంలో ప్రేమ ఖైదీ, గజరాజు వంటి ఫీల్  గుడ్ చిత్రాలని అందించారు దర్శకుడు ప్రభు సాల్మాన్. రైల్ లో ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రైల్’. ఇప్పటికే రిలీజ్ ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కి విపరీతమైన స్పందన వస్తోంది. తాజాగా, ఈరోజు (గురువారం) రైల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ‘రైల్’ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. ఇంతకీ ‘రైల్’లో ఏముందో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
అనగనగా ఓ రైలు ప్రయాణం. ఈ ప్రయాణంలో పూచియప్పన్ (ధనుష్) రైలో కాంటీన్ బాయ్ గా పనిచేస్తుంటాడు. చిత్రంలో నటి పూజా జవేరికి మేకప్ ఆర్టిస్ట్ గా
పనిచేస్తుంటుంది కీర్తి సురేష్. హరీష్ ఉత్తమన్ కమెండోగా కనిపిస్తారు. ప్రకృతి అందాల మధ్య సాగుతున్న రైలు ఆకస్మికంగా టెర్రరిస్టులు హైజాక్ చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఇంతకీ.. ఎవరు కోసం రైలుని హైజాజ్ చేయడానికి ట్రై చేశారు. ధనుష్-కీర్తి సురేష్ ల మధ్య ప్రేమ ఎలా చిరుగురించింది? అసాధారణ పరిస్థితుల్లో ఓ సాధారణ మానవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నదే రైల్ కథ.

ఇప్పటి వరకు ధనుష్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ చిత్రాలని చేసుకొంటూ వెళ్తున్నాడు. ఇక, సాల్మన్ ప్రభు నిజ జీవితానికి దగ్గరగా ప్రకృతికి మరింత దగ్గరగా ఉండే సినిమాలని చేశారు. వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రాబోతుంది అనగానే.. ఓ రకమైన ఆసక్తి నెలకొంది. పైగా రొమాంటికి థ్రిల్లర్.. రైల్ జర్నీ అనగానే సాల్మన్ ఏం చేస్తాడో.. ? అనుకున్నారంతా.. కానీ.. రైల్ ప్రయాణంని సాఫీగానే పూర్తి చేశాడు సాల్మన్. కాకపోతే.. స్క్రీన్ ప్లే విషయంలో మరింత పక్కగా ప్లాన్ చేసుకొంటే బంపర్ హిట్ ఖాతాలో పడేదే.

ప్లస్ పాయింట్స్ :
* టేకింగ్
* ధనుష్
* కీర్తీ సురేష్
* సంగీతం
* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
* డైరెక్షన్
* స్క్రీన్ ప్లే
* రన్ టైం

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ధనుష్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఏ పాత్ర ఇచ్చినా 100 శాతం న్యాయం చేస్తాడు. ‘రైల్’ లోనూ అదే చేశాడు. రొమాంటిక్, యాక్షన్, సెంటిమెంట్..
అన్ని సన్నివేశాలలో బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి సురేష్ మాత్రం షాక్ ఇచ్చింది. ఆమె నటన సూపర్భ్. ధనుష్ కి ఏమాత్రం తగ్గకుండా.. అదే రేంజ్ లో నటించింది. అమాయకపు అమ్మాయిగా కీర్తి నటన చాలా బాగుంది. రొమాంటి, సెంటిమెంట్ సీన్స్ లోనూ.. ఎంతో అనుభవం గల హీరోయిన్ గా నటించింది. టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు కీర్తికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని రైల్ నిరూపించింది.సాంకేతికంగా :
దర్శకుడు ప్రభు సాల్మన్ రాసుకొన్న కథ బాగుంది. కాకపోతే స్కీన్ ప్లేలో తడబడ్డాడు. ప్రేక్షకులని థ్రిల్లింగ్ కి గురిచేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.  కానీ, వాటికి ఒక క్రమ పద్దతిలో పేర్చడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. ఇమాన్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతంలో మరింతగా
ఆకట్టుకొన్నాడు. సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. తెరపై చూపించే లొకేషన్స్ బాగున్నాయి. రన్ టైం ని ఇంకాస్త తగ్గించేస్తే బాగుండేది. ఎడిటింగ్ సరిగ్గా లేదు. మొత్తానికి.. ఎమోషనల్ థ్రిల్లర్ ‘రైల్’ ఓ మాదిరిగా దూసుకెళ్లింది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
స్క్రీన్ ప్లే, చిన్న చిన్న మైనస్ లని పట్టించుకోకుండా.. ధనుష్ నటన ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తోంది. ఈ సారి ధనుష్ కి తోడుగా కీర్తి సురేష్ కూడా ఇరగదీసింది. సో.. ధనుష్ అభిమానులు ‘రైల్’ థియేటర్ లో కూర్చోవచ్చు. ఇక, ఇతరులు రైలెక్కకపోవడమే మంచిది.

ట్యాగ్ లైన్ : రైల్ – ఎమోషనల్ జర్నీ

రేటింగ్ : 2.75/5
SHARE