ధర్మ రాజు అక్కడ హిట్ మరి ఇక్కడ..?

Posted November 16, 2016

Dharma Raju MBBS Title For Kollywood Dharmaduraiకలక్షన్స్ కింగ్ మోహన్ బాబు తను హీరోగా ధర్మ రాజు ఎం.ఏ సినిమా తీశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమా చేశాడు. ఇక ఈ రెండు టైటిల్స్ వాడుకుని ధర్మరాజు ఎం.బి.బి.ఎస్ అంటూ వస్తున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో పిజ్జా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ ఒక్క సినిమాతో రిజిస్టర్ అయ్యాడు. అయితే కోలీవుడ్ లో మినిమం బడ్జెట్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి హీరోగా ధర్మ దురై సినిమా రిలీజ్ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కోలీవుడ్ లో హిట్ అయ్యింది.

తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక తెలుగు టైటిల్ గా ధర్మరాజు ఎం.బి.బి.ఎస్ అని పెట్టారట. ధర్మ రాజు అక్కడ హిట్ కొట్టాడు మరి ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. తెలుగులో తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో అమ్మడు కూడా ఫుల్ గా సారీతోనే కనిపిస్తుందట. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఓ పక్క శివ కార్తికేయన్ కూడా తన రీసెంట్ మూవీ రెమోను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరోలే కాదు కుర్ర హీరోలు కూడా తెలుగు మార్కెట్ పై కన్నేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

SHARE