ధర్మ రహస్యాలు మీకోసం..

321
Spread the love

Posted [relativedate]

dharma secrtets of life for youధర్మం అన్నివేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు.
ఉదా:- ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటపుడు భర్త ధర్మము. అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము, సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మమము, తండ్రితో సంభాషించేటప్పుడు కుమార(పుత్ర) ధర్మం. స్నేహితునితో ఉన్నప్పుడు స్నేహధర్మం, కార్యాలయానికి వెళ్ళి పని చేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మం. ఇంటికి ఎవరైనా అతిథులు, పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్తాశ్రమధర్మం. వానప్రస్థాశ్రమం స్వీకరిస్తే వానప్రస్తధర్మం. అలా ధర్మం అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది.

భారత యుద్దములో అశ్వద్ధామ ఉపపాండవులను నిద్ర పోతుండగా సంహరిస్తాడు. అపుడు అర్జునుడు వెళ్ళి అశ్వద్ధామను బంధించి, తీసుకొనివచ్చి ద్రౌపతికి అప్పగించినప్పుడు, తల్లి ద్రౌపతి ఏమంటుందో చూడండి,
కడుపుకోతలో,పుత్రశోకముతో, విలవిల లాడుచున్న ద్రౌపతి, తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వద్ధామను చూచి, గురుపుత్రా,విప్రోత్తమా, మీరు పాండవుల గురుపుత్రులు, పాండవులు వారి పరమ పూజ్య గురువుగారిని మీలో చూచు కొనుచున్నారు. నాబిడ్డలు ఉపపాండవులు
“ఉద్రేకంబునరారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోమున్ సేయరు, నిద్రాసక్తుల చిన్నిపాపల సంహరింప నకటా నీచేతులెట్లాడేనో.”

ఉపపాండవులు చిన్ని పాపలు, నిద్రపోవుచున్న వారిని చంపడానికి, మీకు చేతులు ఎలావచ్చాయి.. నిన్ను బంధించిన వాడు అర్జునుడని, ఆసాద్ధ్వీమతల్లి గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము, ఎలాంటిదో, ఎలాఉంటుందో నేను అనుభవించుచున్నాను, ఆ పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని, ఆ సాద్వీమతల్లిది ఎంత ధర్మవర్తనో చూడండి,

“ఒరులే యవి యొనరించిన నరవర, అప్రియము తనమనంబునకగు, తా నొరులకు నవి సేయకునికి పరాయణ పరమధర్మపధములకెల్లన్.”
ప్రవర్తించకుండా ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగుతుందో,అలాంటి పనులు, ప్రవర్తన, మనము ఇతరులపట్ల, చేయకుండా ఉండడముకంటే గొప్పధర్మము వేరొకటిలేదు. అని ధర్మవిషయము లను వివరించి,అశ్వద్దామను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీ కృష్ణుని ప్రార్తిస్తుంది. చూచార అంతటిబాధలో అంతటి కడుపుకోత అనుభవించుచూ కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపతీ అమ్మవారు .

శ్రీ రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు, ఆ సమయానికి యుద్ధవిరామ సమయము కూడా కావడముతో, శ్రీ రాముడు రావణా ఈరోజువెళ్లి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీ రామచంద్రుడు. ఎందుకనగా, ఈ రాత్రికైన రావణాసురునికి జ్ఞానోదయమైతే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాములవారికి అప్పగించి, శరణార్ది నంటాడేమో అని, శ్రీరామచంద్రులవారు ఒక్క అవకాశమిచ్చాడు. అదే ధర్మము. తన భార్యను అపహరించిన వానికి కూడా, మారడానికి, తనతప్పును తను తెలుసుకోవడానికి, అవకాశ మిచ్చి ధర్మమునకు నిలబడిన, మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందు కొరకు రామాయణము, మహాభారతము,భాగవతము చదవాలి చదివిచాలి, వినాలి వినిపించాలి మనపిల్లలకు మనవారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము,బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాస్వితముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి సంప్రదాయములు సనాతనధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరినీ పాడుచేసిన ధాకలాలు లేవు.

ఆపద్ధర్మం ఉంది చూశారూ, జీవితం నడవడం కష్టమయినప్పుడు, సత్కర్మకు దోషం కలుగకుండా, ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం ఆశ్రయించడం కూడదు.ధర్మమార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి.
మానవునికి నిద్రరాకపోవడానికి విదురుల వారు నాలుగు కారణములు చెప్పినారు.
1.బలవంతులతో వైరం తెచ్చుకున్నా,
2.పరుల సంపదను అపహరించినా,
3.పరుల సంపదలను అపహరించాలనుకున్నా, పరుల సంపాదనను, సంపదను చూచి ఈర్ష్య చెందినా,
4.పరస్త్రీని పొందుకోరుకున్నా,
ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాత్రులకు రాత్రి యందు నిద్రపట్టక పోవడానికి వేరు కారణాలు చూపలేదు.

మూర్ఖుల లక్షణాలు:-
అహంకారం, విద్యాశూన్యత, వివేకహీనత,ఏ పనీ చేయకనే (శ్రమ పడకుండా) ఫలమాసించుట, దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు వేయుట, ఊహలలో జీవించుట, శత్రువులను స్నేహితులుగా భావించుట, అడుగక పోయినా వచ్చి సలహాలిచ్చుట, ఎల్ల వేళలా ఎదుటివారిలో దోషముల కొరకు వెతుకుట, అకారణ క్రోధము, కలహములు ప్రోత్సహించుట, విషయ పరిజ్ఞానములేక భాషించుట, ధర్మాధర్మ విచక్షణ లేకుండుట, పరస్త్రీ వ్యామోహము, నిర్దయ,పరధనాపేక్ష, నిత్యమూ అనృతములు భాషించుట, దైవ దూషణము ఇత్యాది లక్షణ సంపన్నులు.

మోక్షదాయకములు:-
ధర్మము, నీతి రెండూ ఎప్పుడూ కలిసే నడుస్తుంటాయి.నిరంతరం ఏదో కృషి చేస్తూ, సాత్విక స్వభావముతో సహన శీలతతో, నిశ్చల ధర్మదీక్షతో ఉండేవారు, ఎప్పుడూ సత్ఫలితాలనే పొందుతారు. వీరినే విద్వాంసులు అని అంటారు.
నీతి విషయములు

ప్రజా రక్షణ చేయలేని ప్రభువు, నిరంతరం పరుషంగా భాషించే భార్య, విద్య నేర్పలేని గురువు, వనవాసం మీద ఆసక్తి చూపే వ్యాపారి వీరు ఎందుకు కొరగారు.
ఆరోగ్యము, ధర్మార్జనతో, ధర్మముతో కూడిన సంపదలు, అనుకూలవతి ఐన అర్థాంగి, చెప్పిన మాట వినే తనూభవుడు, జీవన ఉపాధికి పనికి వచ్చే విద్య, చక్కని సలహాలిచ్చే స్నేహితుడు, ప్రపంచ శాంతి నాసించే శాంతి కాముకులు, పరోపకారాభిలాషులు వీరు సుఖంగా బ్రతుకగలుగుతారు.
సుఖ దుఃఖములు అనుభవించే జీవితం ఆశాశ్వతమైనదే, శాశ్వతమైనది ధర్మం ఒక్కటే.

“క్షీణే పుణ్యే మర్స్యలోకం విశంతి”
దేవతల యొక్క పుణ్యం ఖర్చు అయిపోతే వారు కూడా భూమి మీద వచ్చి పడిపోతారు.

రామాయణంలో హనుమ:-
“శతకృతుని వాసేనం నాగరాజస్య మూర్థనీ”
అంటే భూమి మీద ఉన్న మనిషి, సరైన కర్మానుష్టానము చేసి ధర్మమమును పట్టుకొని ఆచారాన్ని పట్టుకొంటే తాను దేవత కాగలడు . దేవరాజు (దేవేంద్రుడు) కాగలడు.

శిష్టాచారము:-
వేదము పరమేశ్వర ప్రోక్తము (అపౌరిషేయము) వేదము భగవంతుని చేత చెప్పబడినది. వేదము చెప్పిన విధముగా వేద సమ్మతముగా నడచిన, అనుష్టించిన ధర్మమే, ధర్మము. అంతే కానీ మనకు ఇష్టం వచ్చిన రీతిలో మనకు అనుకూలంగా చేయడం ధర్మం కాదు.
కాలము రెండు కాళ్ళ మీద నడుస్తుంది.
సంవత్సరము.
రెండు ఆయనము పూర్తి అయితే సంవత్సరము.
1.ఉత్తరాయణము:- పొందవలసిన మార్గము పొందుటకుమంచి కాలము.
2.దక్షిణాయనము:- అనుష్టానములకు సంబందించి అనుకూలమైన కాలము(పవిత్రమైన కాలము)గణపతి నవరాత్రు లు,శారదా నవరాత్రులు, శ్రావణ మాసంలో మహాలక్ష్మీ అమ్మవారి సేవలు, నోములు వ్రతాలు అన్నీ ఈ ఆయనములో ఉంటాయి.
3.ఆయనములలో ఋతువులు. ఋతువులలో మాసములు, మాసమూలలో పక్షములు, పక్షములలో రోజులు, రోజులో పగలు రాత్రి. రోజు అనుష్టానములో రాత్రి ఉండదు. రాత్రి పడుకునే అంత వరకు మాత్రమే అనుష్టానము.
ఆచారము=చరతి=అలాకదులుట. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాకాదలాడుట.
“ఆచారవ లభతే ధర్మం”
ఎప్పుడైతే ఆచారాన్ని పాటిస్తావో అప్పుడు ధర్మం అలవడుతుంది.
ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తావో అపుడు మనకు తెలియకుండానే
భగవంతుని వైపుకు మనము తిరుగుతాము.
ధర్మమము అనగా కాలము+దేశముతో ముడిపడి ఉండేదే ధర్మం.
ధర్మానుష్టానములో ఎప్పుడు కానీ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో పడుకొనరాదు నిద్రించరాదు. భగవదారాధనకు అనుకూలమైన కాలము.

ప్రాతః సంధ్య:- సూర్యోదయమునకు 88 నిమిషముల ముందు ఉన్నకాలము. పరమ యోగ్యమైన కాలము. బ్రహ్మ
ముహూర్తము.
ఉత్తర సంధ్య:– ప్రదోషకాలము. పడమటి సంధ్య వేళలో ఎలా ఉన్నాపడుకోరాదు. అనారోగ్యముతో ఉన్నా కనీసం పదినిమిషాలు కూర్చోనాలి.
“వృషీశ్వర యానంబున సంచరించుటది అభావ్యంబయ్యే”
ఉత్తర సంధ్యా సమయములో పరమశివుడు వృషభ వాహనము మీద తిరుగుచుంటాడని ఈ సమయంలో కేవలం భగవన్నామస్మరణ సంకీర్తన మాత్రమే చేయాలని దితితో కశ్యపుల వారు చెప్పిరి.’

శివకేశవ బేధము:-
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే
శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః”
“యధాశివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః
యధాంతరం నవశ్యామి తధామేస్వ స్టిరాయుషి”
పగలుకు విష్ణువు, రాత్రికి శివుడు అధినాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here