పాత కథ ధర్మాన కొత్తగా చెప్పింది ఎందుకు?

0
483

Dharmana+Prasada+Rao
కడప లో సామాజిక సమీకరణాల వల్ల అక్కడ జగన్ గెలవడం తేలిక ..అదే శ్రీకాకుళంలో గెలవడం అంత సులభం కాదు …వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు చెప్పిన మాటలు.ఉత్తరాంధ్ర లో సామాజిక సమీకరణాలు క్లిష్టంగా వుంటాయని చెప్పేందుకు ధర్మాన వాడిన పదజాలం రాష్ట్రమంతటా చర్చకు దారి తీసింది.అయన చెప్పింది ఎంత సాధారణ,పాత విషయంలో కనీస రాజకీయ పరిజ్ఞానం వున్నవారందరికీ తెలుసు .

అయితే అయన కొత్తగా ఈ విషయాన్ని ప్రస్తావించడం మీదే సందేహాలు.అధికార పక్షం,మీడియా ధర్మాన వ్యాఖ్యలపై ఈకలు పీకుతుందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి .కానీ వాళ్ళు ఓ విషయం దాస్తున్నారు.ధర్మాన ప్రసంగం అయిపోయిన వెంటనే విషయం ఏంటని ఆరా తీసింది వైసీపీ కీలక నేతలే.వైసీపీ కే ధర్మాన మీద అంత డౌట్ ఉంటే మిగతా వాళ్లు రంధ్రాన్వేషణ చేయడం సహజమే కదా!

ఇంతకీ ధర్మాన పాత విషయాన్ని కొత్తగా చెప్పడం వెనుక జగన్ వ్యవహారశైలి మీద అసంతృప్తి అని చెప్తున్నారు .అందులో నిజానిజాలెలా వున్నా…..కాంగ్రెస్ హయాంలో దిగ్గజ రాజకీయవేత్తలుగా వెలిగిపోయిన వాళ్లంతా ఇంకా విభజన దెబ్బకి షాక్ తింటూనే వున్నారు.పార్టీ మారినా పాత గౌరవం దక్కడం లేదని ఇలాంటి నేతల బాధ.ఈ కోవలో బొత్స,కన్నా లాంటి నేతలు చాలా మంది వున్నారు.వీళ్లంతా వచ్చిన ,వస్తున్న మార్పుల్ని తట్టుకోలేకపోతున్నారు.అదీ కాల మహిమ.క్షణానికో రంగు మారే రాజకీయ సిత్రం …

Leave a Reply