స్పైడర్‌తో దిల్‌రాజుకు సంబంధం ఏంటో?

118
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

dhil raj came forward to buy a 'Spider' movie,
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, తమిళస్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్‌’. ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం జూన్‌లో విడుదల అవ్వాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. దాంతో సినిమా కూడా విడుదల ఆలస్యం అవుతుంది. దాదాపు 110 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా చెబుతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘స్పైడర్‌’ చిత్రాన్ని దిల్‌రాజు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.

దిల్‌రాజు ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. అయినా కూడా ‘స్పైడర్‌’ చిత్రంపై ఉన్న ఆసక్తితో దిల్‌రాజు నైజాం రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఉన్న పోటీ రీత్యా ఏకంగా 25 కోట్లను పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇప్పటికే నిర్మాతలతో దిల్‌రాజు చర్చలు జరుపుతున్నాడని, త్వరలోనే ఈ డీల్‌ ఫైనల్‌ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒక్క నైజాం ఏరియాలోనే కాకుండా అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమాను భారీ మొత్తాలకు నిర్మాతలు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మురుగదాస్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. 175 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను ఈ సినిమా చేస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్‌బాబుకు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here