ధోని ట్రైలర్ భారీ హిట్?

0
516

   dhoni cinema trailer create history youtube

టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ ఎమ్‌.ఎస్‌.ధోనీ జీవితంపై వస్తున్న సినిమా ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’. ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 11న రిలీజైంది. యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది ఈ ట్రైలర్. ప్రస్తుతం కోటి పదమూడు లక్షలు మంది చూశారు. సుషాంత్‌ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నీరజ్‌ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు.

హిందీ సినిమా చరిత్రలో ఇంత వరకూ ఏ సినిమా ట్రైలర్‌కు రానన్ని లైక్ లు.. వ్యూస్ ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ’ ట్రైలర్‌కు వచ్చాయంటూ.. తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు హీరో సుషాంత్. ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు. సెప్టెంబరు 30న ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.

Leave a Reply