అష్ట ధ్రువ వెనుకేముంది..

 dhruva movie first look 8 number backside story what.?మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘ధృవ’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. కొత్త మీస కట్టు.. హెయిర్ స్టైల్.. లైట్ గా కనిపించే గెడ్డం.. కొత్తగా అనిపించే డ్రెసింగ్.. ఓవరాల్ గా చెర్రీ ఇరగదీసేశాడు. నా శతృవే నా బలం అనే ట్యాగ్ లైన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే.. ఈ ఫస్ట్ లుక్ లో చెర్రీతో సమానంగా ఆసక్తి రేకెత్తించిన మరో పాయింట్.. టైటిల్ లోగో డిజైన్.

ధృవ లెటరింగ్ కి వెనకాల 8 నెంబర్ ను ఎంబోజ్ చేశారు. అదే ఇప్పుడు సస్పెన్స్ గా మారిపోయింది. ఇప్పుడీ 8 కి అర్ధం ఏంటా అని ఆన్ లైన్ లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఇందులో చెర్రీ పోలీస్ ఆఫీసర్ గా నటించనుండడంతో.. అతని బృందంలో మొత్తం 8మంది మెంబర్స్ ఉంటారనే మాట వినిపిస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇది ఎనిమిదో మూవీ కాబట్టి.. అలా ఈ సంఖ్యను ఎంబోజ్ చేశారని మరికొందరు అంటున్నారు. ఈ థియరీల్లో వాస్తవం ఉందో లేదో చెప్పాలంటే చెర్రీ కానీ.. దర్శకుడు కానీ నోరు విప్పాలి. వాళ్లు సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఈ సస్పెన్స్ ని మెయింటెయిన్ చేసేలా ఉన్నారు.

SHARE